Rakul: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలే అవసరం లేదు. గిల్లి అనే కన్నడ మూవీతో సినీ రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ.. కెరటంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఎప్పుడో వచ్చిందో కూడా ఎవరికీ తెలీదు.
అయితే ఆ తర్వాత తనదైన టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ రకుల్ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. బాలీవుడ్లో మాత్రం వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేస్తూ మస్తు బిజీగా గడుపుతోంది.
ఇప్పటికే రకుల్ నటించిన హిందీ చిత్రాలు ఎటాక్, రన్ వే 34 చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే బాలీవుడ్లో థాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రివాలి, మిషన్ సిండ్రెల్లా అనే చిత్రాలు కూడా చేస్తున్న ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న `31 అక్టోబర్ లేడీస్ నైట్` అనే మరో మూవీ చేసేందుకు సైన్ చేసింది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో తన ఫాలోవర్స్‌కు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. తాజాగా కూడా బుల్లి షార్ట్, స్కర్ట్ ధరించి చెమటలు పట్టించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే, అంత హాట్‌గా రకుల్ కనిపిస్తోంది. మరి లేటెందుకు రకుల్ లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.