RRR: కొద్ది క్షణాల క్రితం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సస్ 2023 ఫైనల్ ఆస్కార్ నామినేషన్ లిస్టు ప్రకటించడం జరిగింది. 95వ ఆస్కార్ నామినిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో “RRR” లో “నాటు నాటు” సాంగ్ నామినేషన్ దక్కించుకుంది. ఆల్రెడీ ఈ పాటకి గోల్డెన్ గ్లోబ్ అనే అంతర్జాతీయ అవార్డు కూడా రావటం తెలిసిందే. అవార్డుని లాస్ ఏంజిల్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందుకున్నారు. అప్పుడు కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో.. నామినేట్ అయ్యి అవార్డు దక్కింది. ఇప్పుడు అదే కేటగిరీలో ఆస్కార్ బరిలో ఉండటంతో కచ్చితంగా “RRR” గెలుస్తుందని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. మార్చి 13వ తారీకు ఎవరు గెలుస్తారు అన్నది తెలియనుంది.
ఇక ఇదే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో “RRR”.. “నాటు నాటు” పాటతో పాటు.. మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. మరి అయిదు పాటలో ఏ పాట ఆస్కార్ అవార్డు గెలుస్తుందో ఉత్కంఠ భరితంగా మారింది. నాటు నాటు పాటకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కాగా లిరిక్స్ చంద్రబోస్ అందించగా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడటం జరిగింది. వీరి పేర్లను అకాడమీ టీం ప్రచురించడం జరిగింది. 95 వ అకాడమీ అవార్డుల నామినేషన్ సాధించిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా “RRR” రికార్డు క్రియేట్ చేయడం జరిగింది.
గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR” ఇండియాలో దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. రామ్ చరణ్ మరియు తారక్ ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తరువాత హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమాని అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రెండుసార్లు చూసి దర్శకుడు రాజమౌళి పనితనాన్ని ప్రశంసించడం జరిగింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు.. గెలుచుకోవటంతో ఆస్కార్ కూడా “RRR” గెలుస్తుందని తెలుగు సినీ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.