RRR: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో జక్కన్న ఇద్దరు హీరోలతో కలిసి వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్‌లో పాల్గొంటూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నాటకలోని చిక్బల్లాపూర్లో మార్చి 19న సాయంత్రం 6 గంటలకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతేకాకుండా, ఆర్ఆర్ఆర్ టీమ్ రేపటి నుండి మరిన్ని ప్రచార కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసింది. ఆరు రోజుల్లోనే 9 ప్రధాన నగరాల్లోని సినీ ప్రియుల్ని ‘ఆర్ఆర్ఆర్’ బృందం కలవబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ రూట్ మ్యాప్‌ను కొద్ది సేపటి క్రితమే మేకర్స్ సోషల్ మీడియా ద్వారా బయటకు వదిలారు. దీన్ని చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. అంతలా జక్కన్న ప్రమోషన్స్‌ను ప్లాన్ చేశారు.
ఈ నెల 18న దుబాయ్‌లో జరగనున్న ఈవెంట్‌తో మొదలు కానున్న ఆర్ఆర్ఆర్ టీమ్ జర్నీ.. ఆ తర్వాత మార్చి 19న కర్ణాటక చిక్బల్లాపూర్లో ప్రిరిలీజ్ ఈవెంట్, మార్చి 20న ఢిల్లీ, మార్చి 21న అమృత్సర్.. జైపూర్, మార్చి 22న కోల్‌కతా.. వారణాసి, మళ్లీ 23వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇలా ఆరు రోజుల పాటు ప్రమోషన్స్‌తో మొత్తం దేశాన్ని చుట్టేయనున్నారు.
Gear up for a thunderous and exciting week of promotions💥
Come join our MaRRRch… 🙌🏻🤞🏻#RRRTakeOver #RRRMovie pic.twitter.com/ZSxYFinuwh
— RRR Movie (@RRRMovie) March 17, 2022