యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా నుంచి రెండో మేకింగ్ వీడియోను శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. శ్రద్ధ బర్త్ డే స్పెషల్ కాబట్టి ఈ మేకింగ్ వీడియోలో శ్రద్ధా కపూర్ గన్ను ఫైరింగ్ సీన్ ని హైలైట్ చేస్తూ మేకింగ్ వీడియోని కట్ చేశారు. భారీ స్థాయిలో వరల్డ్ బెస్ట్ టెక్నీకల్ టీమ్ లో రెడీ అవుతున్న ఈ సినిమా రేంజ్ ఏంటో చాప్టర్ 1తోనే ప్రూవ్ చేసిన చిత్ర యూనిట్… చాప్టర్ 2తో సాహో రేంజ్ ని ఆకాశానికి పెంచేశారు.
ఈ మేకింగ్ వీడియోలో చూపించిన విజువల్స్ బట్టి సినిమాలో ఫైట్లు తెలుగు తెరపై ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా మేకింగ్ వీడియోలో ఒక గన్ తో డిజైన్ చేసిన ఫైట్ కానీ, ఎండ్ లో ప్రభాస్ పైన కట్ చేసిన సీన్స్ కానీ సూపర్బ్ గా ఉన్నాయి.. మేకింగ్ వీడియో అంత ఒకటి ఎండ్ షాట్ లో ‘బూమ్’ అనే సౌండ్ ఒకటి… క్లోజ్-అప్ షాట్ లో కొత్త హెయిర్ స్టైల్ లో ప్రభాస్ ముందెన్నడూ చూడని విధంగా ఉన్నాడు. అయితే ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు, డైరెక్టరు కథ మీద కంటే స్టయిల్ మీదే ఎక్కువ ఫోకస్ పెడతాడు. ప్రభాస్ గతంలో నటించిన ‘బిల్లా’ సినిమా విషయంలో కూడా జరిగింది ఇదే. ఇప్పుడు హై టెక్నీకల్ స్టాండర్డ్స్ తో రాదు అవుతున్న సాహో విషయంలో కూడా ఇదే జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దాదాపుగా 300 కోట్లు బడ్జట్ తో పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సాహో సినిమా వస్తుంది కాబట్టి పెట్టిన డబ్బులు కచ్చితంగా వస్తాయి కానీ స్టైలిష్ మేకింగ్ కి సాలిడ్ కథ కూడా తోడైతే ప్రభాస్ బాహుబలి రికార్డులని బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు.
previous post
next post