Siri Srihaan: తెలుగు బిగ్ బాస్ షోలో సీజన్ ఫైవ్ లో సిరి, సీజన్ సిక్స్ రన్నర్ శ్రీహాన్ ఇద్దరూ లవర్స్ అని అందరికీ తెలుసు. సీజన్ ఫైవ్ లో సిరి చాలా దూకుడు గేమ్ ఆడింది. ఫిజికల్ టాస్క్ పరంగా ఇంకా… ఎంటర్టైన్మెంట్ పరంగా తన బెస్ట్ ఇవ్వటం జరిగింది. అయితే షణ్ముక్ తో చాలా క్లోజ్ గా ఉండటంతో ఆమెకు కొంత నెగిటివిటీ బయట ఏర్పడింది. అయితే ఆ సమయంలో శ్రీహన్ కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇద్దరు కూడా బ్రేకప్ చెప్పుకునేదాకా పరిస్థితి మారింది.
ఈ విషయాన్ని సిరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేయడం జరిగింది. అయితే తర్వాత పరిస్థితులు మారడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దుమనగటంతో ఇప్పుడు మరింత క్లోజ్ గా ఉంటున్నారు. పైగా శ్రీహాన్ సీజన్ సిక్స్ లో కీలకంగా రాణించటంలో సిరి బయట ఉండి ప్రముఖ పాత్ర పోషించింది. దీంతో బిగ్ బాస్ ప్రైజ్ మనీ శ్రీహాన్ గెలవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ స్టార్ జంట వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారట. ఇటీవల ఓటీటీ లలో ఇంకా పలు షోలలో సిరి కీలకంగా రాణిస్తూ ఉంది.
బయట వీరికి మంచి క్రేజ్ ఉండటంతో.. త్వరలో వెబ్ సిరీస్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరించనున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో సిరి తెలిపింది. “మా ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అందువలన మేమిద్దరం కలిసి వెబ్ సిరీస్ లో చేద్దామని అనుకున్నాము. ఇంతలో శేఖర్ మాస్టర్ ప్రొడక్షన్ హౌస్ లో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్ లో చేస్తున్నాము” అంటూ తెలియజేసింది.