Vasanti: బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమస్ అయిన వాసంతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందం అభినయం కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. తన ముద్దు ముద్దు మాటలతో ఎంతోమందిని ఆకట్టుకుంది. బిగ్బాస్ సీజన్ 6 లో పాల్గొన్న ఈమె అందరి హృదయాలను గెలుచుకుంది.
ఇక ఈమె బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం అనేక ఆఫర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవలే ఈమెకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తన ప్రియుడు పేరు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన వాసంతి సీరియల్ మరియు సినిమాల్లో నటించింది. ఇక ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈమె తాజాగా పెళ్లి సైతం చేసుకుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా పవన్ కళ్యాణ్ తో వాసంతి ఏడాది ప్రేమలో పడినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
అలా ప్రేమించుకున్న వీరిద్దరూ డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం పెద్దలు అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు…” వాసంతి ఫేమ్ మరియు అందానికి ఆ యువకుడు సరిపోకపోయినా ప్రేమకి కట్టుబడి ఆమె పెళ్లి చేసుకుంది. అయినా ఇద్దరు క్యూట్ కపుల్ లాగానే ఉన్నారు. ఏదేమైనా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.