పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా “లైగర్”. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ లు, వీడియోలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ న్యూడ్ లుక్ సినిమాకి ఎంతో పబ్లిసిటీ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల సినిమాలో రిలీజ్ అయిన పాటలు కూడా సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ తో పాటు అనేక లైకులు సాధించడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈనెల 21వ తారీకు “లైగర్” ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ వాలే అధికారికంగా ప్రకటించింది.
“లైగర్” నుండి మరో బిగ్ అప్ డేట్..!!
అయితే ట్రైలర్ కార్యక్రమం భారీ లెవెల్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీనిలో భాగంగా జులై 21వ తారీకు పొద్దున్న హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ నందు ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు అంట. ఇక ముంబైలో సినీ పోల్స్ లో సాయంత్రం ఏడున్నర గంటలకు హిందీ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కీలక పాత్ర చేయడం విశేషం.
ప్రస్తుతం వరుసపరాజయాలలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పై బోలెడన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా “లైగర్” రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలపై సినిమా యూనిట్ భారీగా ఫోకస్ పెట్టడం జరిగింది. నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ సినిమాకి సంబంధించి బాలీవుడ్ ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు.