Pawan Kalyan CBN: ఏపి రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లి సమావేశమైయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు తెలుస్తొంది. ఇటీవల కాలంలో ఇరువురు నేతలు భేటీ కావడం ఇది మూడవ సారి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై కలిసి పోరాడే అంశఓంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తొంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తుతో బరిలో దిగుతారన్న సంకేతాలు వస్తున్న తరుణంలో చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదనపై కేంద్ర పెద్దలు ఏమన్నారు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ మీడియాకు వెళ్లడించలేదు. ఎన్డీఏతో మళ్లీ కవడానికి తనకు అభ్యంతరం లేదన్నట్లుగా ఇటీవల చంద్రబాబు ఓ మీడియా ఛానల్ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ పెద్దల మనసులో ఏమున్నది అనేది ఇంత వరకూ స్పష్టత లేదు.
టీడీపీ – జనసేన పొత్తుల విషయంలో ఆయా పార్టీల నేతలు ఇప్పటి వరకూ బహిరంగంగా మాట్లాడకపోయినా రాష్ట్రంలో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. మరో పక్క ఏపిలో తోడేల్లన్నీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి చూస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ పదేపదే విమర్శిస్తూనే ఉన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయకూడదు అన్న రీతిలో వైసీపీ నేతలు దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ రెండు పార్టీలకు సవాల్ చేస్తున్నారు. జగన్ చేస్తున్న విమర్శలపై మచిలీపట్నంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ స్పందించారు.
మేము ఒంటరిగా వస్తే మీకేందుకు, కలిసి పోటీ చేస్తే మీకెందుకు అని పవన్ ప్రశ్నించారు. అంతే కాకుండా మీరు ఏమి కోరుకుంటున్నారో, మీ మనసులో ఏముందో అదే జరుగుతుంది అని కూడా వ్యాఖ్యానించారు. అయితే పొత్తులపై స్పష్టత ఇవ్వలేదు కానీ తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్. ఒంటరిగా పోటీ చేయడం, లేదా టీడీపీతో కలిసి పోటీ చేయడం, బీజేపీ, టీడీపీ తో కలిసి పోటీ చేయడం ఈ మూడు ఆప్షన్స్ ఉన్నట్టు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు మూడో సారి భేటీ కావడంతో ఈ సమావేశంలో ఏయే విషయాలపై చర్చించారు అనేది తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలపైనా చర్చించినట్లు తెలుస్తొంది.
రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా.. తనదైన బాణీలో కొడాలి