NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం..! సహాయానికి మోడీ హామీ..!!

 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో కుండపోతగా కురిసిన వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. వరద ప్రవాహానికి  వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వీధులన్నీ జలమయం అయి చెరువులను తలపించాయి. 1500 ఇళ్లకుపైగా జలదిగ్బంధమయ్యాయి. 20 వేలకు పైగా ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహదారులు దెబ్బతిన్నాయి. వీధుల్లో నిలిపిన కార్లు, ఆటోలు, బైక్ లు వరద నీటికి కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడపాల్సి వచ్చింది. 30 పాత పాత భవనాలు, గోడలు కూలిపోయాయి. సహాయక చర్యల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. వందేళ్ల తరువాత కురిసిన రికార్డు వర్షపాతానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటి వరకూ  13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షలు జరిపి యుద్ద ప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలోనూ భారీ వర్షాలు, వరదలకు వందలాది మంది నిరాశ్రయులైయ్యారు. కృష్ణానదికి వరద పోటేత్తడంతో నది పరివాహాక ప్రాంతాల్లోని గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. వేలాది పంట పంట పొలాలు ముంపునకు గురి అయ్యాయి. వివిధ జిల్లాలలో పది మంది మృత్యువాత పడ్డారు. చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులుతో సమీక్షా సమావేశం నిర్వహించి సహాయక చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.

కేంద్రం నుండి సహకారం అందిస్తాం – మోడి

కాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఫోన్ చేశారు. భారీ వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపి సీఎం వైఎస్ జగన్‌లతో మోడీ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో కేంద్రం నుండి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు మోడి. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోని భారీవర్షాలు, వరదల పరిస్థితిపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఇరు రాష్ట్రాలకు సాధ్యమైనంత సాయం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. వరద నష్టం నుండి త్వరగా రెండు రాష్ట్రాలు కోలుకోవాలని అమిత్ షా అకాంక్షించారు.

author avatar
Special Bureau

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N