NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో చెప్పిన డ్రైవర్ దస్తగిరి..! కాస్ట్లీ మర్డరే..! సుపారీ ఎంతంటే..?

Viveka Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పలువురు ప్రధాన నిందితులను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకడైన వివేకా కారు డైవర్ షేక్ దస్తగిరి ఆగస్టు 30న హత్యకు సంబంధించి పూర్వాపరాలను కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కన్ఫెషన్ స్టెట్ మెంట్ లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. సీఆర్పీసీ 164(1) సెక్షన్ కింద పొద్దుటూరు కోర్టులో వ్యాగ్మూలం రికార్డు చేశారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ ను మిగతా నిందితుల న్యాయవాదులకు కోర్టు ఇచ్చింది.

Viveka Murder Case dastagiri confession statement
Viveka Murder Case dastagiri confession statement

 

Viveka Murder Case: హత్యకు సూత్రధారి ఎర్ర గంగిరెడ్డే

బెంగళూరు భూ వివాదంలో వాటా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఉన్న ఎర్ర గంగిరెడ్డి వివేకా హత్యకు ప్లాన్ చేశాడనీ, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డితో కలిసి హత్య చేసినట్లు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారనీ వివేకా గంగిరెడ్డి, అవినాష్ లకు వార్నింగ్ ఇచ్చారని వాగ్మూలంలో పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని తెలిపారు. కోటి రూపాయలు ఇస్తాం, వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేసినట్లు దస్తగిరి వెల్లడించాడు.

వివేకా హత్యకు 40 కోట్ల సుపారీ

మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ కాగా తనకు అయిదు కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారని దస్తగిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్ లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు. మిగిలిన 75 లక్షలు తన స్నేహితుడు మున్నా దగ్గర దాచినట్లు పేర్కొన్నారు. సునీల్ యాదవ్, ఉమా శంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్లు తెలిపారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డితో కలిసి తాను వివేకా ఇంటి ప్రహరీగోడ దూకి లోపలికి వెళ్లినట్లు దస్తగిరి వెల్లడించారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు కన్షెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు దస్తగిరి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N