శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో చిరుత
ఇవి కిందటి వారం వార్తలు
ఇవి కొత్త కాదు వింత కూడా కాదు
పదేళ్ల కిందట తిరుపతి నడక రోడ్డులో చిరుత తిరుగుతోందని చదివేం
అప్పుడే శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు ఎన్నో ఊళ్ళ మీద పడి వీరంగం చేసేయని కూడా చదివేం
ఎందుకూ
తినడానికి చెట్లు లేక ఉండడానికి అడవులు లేక
ఇప్పటి పరిస్థితీ అదే అప్పుడే మేలుకొని ఉంటే బావుండేది
అప్పుడు తిరుపతి కొండ కింద Vedic university పెట్టేరు శుభం
ఏదయినా చదువేకదా
కానీ దాన్ని ఏ ఊరి చివరో పెడితే బావుండేది
దానికోసం చెట్లు నరికేసేరు
అవైనా తుమ్మ చెట్లు వేప చెట్లు కాదు
అసలు సిసలు టేకు చెట్లు.. ఎన్నో తెలుసా.. పదివేలు
ఒక్కొక్క చెట్టు ఖరీదు రెండు లక్షలు
అవి కొట్టడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చేరో తెలీదు
ఆచెట్లు ఏవయ్యయో తెలీదు
మరి జంతువులు ఎక్కడ ఉంటాయి
అందుకే ఊరిమీద పడుతున్నాయి
అప్పుడు తిరుపతి శ్రీకాకుళం
ఇప్పుడు శ్రీశైలం హైదరాబాద్ అంతే
వేదాల స్కూల్ ప్రతి ఊళ్లోనూ పెట్టండి ఎవరు కాదన్నారు
కానీ చెట్లు నరికి కాదు
మళ్ళీ మనం ecodrive, environment, green revolution నా పిండాకూడు అని స్లోగన్లు
ప్రతి మనిషి ఒక మొక్క నాటాలట
ఎందుకు మర్నాడు పీకేయ్యడానికా
వృక్షో రక్షతి రక్షిత అని ప్రతి చోట రాస్తారు
సెలెబ్రిటీలు చిన్న మొక్క నాటుతూ ఫోటోలు
ఇదిగో పడుపు అదిగో ముసుగు అని ఇవాళ నాటడం రేపు మేకలు తినెయ్యడం
మనం ఒక ముఖ్యమైన సంగతి మరిచిపోతున్నాం
ఆంథ్రోపాలజీ ప్రకారం మొదట చెట్లు జంతువులూ పక్షులు కొండలు వగైరా పుట్టేయి
ఆఖర్న పుట్టింది మనం
భూమి మీద ప్రాధమిక హక్కు వాటిదే
ఆది మానవుడి దశలో మనం జంతువులూ కలిసి అడివిలోనే ఉన్నాం
నాగరికత పెరిగి మనం ఊరిలోకి వచ్చేం
హైస్కూల్లో చెట్లు రాత్రిపూట ఆక్సిజెన్ వదిలి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి అని చదివేం
మరి ఇలా చెట్లు నరుక్కుంటూ పొతే మనకి ఆక్సిజెన్ ఎక్కడినుంచి వస్తుంది
కొన్ని ఏళ్ళ తరవాత ఆక్సిజెన్ సిలెండర్ కట్టుకొని తిరగాలి
అంతేకాదు చెట్లు ఉంటేనే వర్షాలు పడతాయి
ఇప్పటికైనా చెట్లు నరికి చెరువులు పూడ్చి కాంప్లెక్స్‌లు కట్టడం ఆపండి
ఇంక ఎక్కడైనా కట్టుకోండి
అశోకుడు రోడ్డుకి రెండు వైపులా చెట్లు నాటించెను అని చదువుకున్నాం
తరవాతి తరాలు మన చరిత్ర రాసినప్పుడు చెరువులు పూడ్చెను చెట్లు నరికెను అని రాస్తారేమో
వినడానికి ఎబ్బెట్టుగా లేదూ
బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ