నాటకాల సప్తాహాలు విన్నాం
డాన్సు సప్తాహాలూ విన్నాం
ఇప్పుడు తల్లిపాల సప్తాహాలు వింటున్నాం
వింటే అసహ్యం వెయ్యడం లేదూ
పుట్టిన పిల్లకి పాలివ్వమని ఒకరు చెప్పాలా
పశువులకి జంతువులకి ఎవరు చెప్తున్నారు, అది ఒక instinct
పులికూడా తన పిల్లలకి పాలిస్తుంది
మరి మీకు అపాటి జ్ఞానం లేకపోయింది
తల్లిపాలతో పిల్లకి అన్ని జబ్బులనుంచి immunity వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు
వాళ్ళు చెప్పేవరకు మనకి తెలీదా
మళ్ళీ నేను పాతకాలానికి వెళ్ళక తప్పదు
గతం లేనిదే వర్తమానం లేదు
చాలా చాలా ఏళ్ళ క్రితం ఈ పాలడబ్బాలు పాలసీసాలు లేవు
పిల్లనికన్న ప్రతి తల్లి పాలిచ్చి పెంచేది
అయితే కొంతమందికి శరీరలోపం వల్ల పాలు పడవు మరెలా
కొంతమంది ఆవు పాలు పట్టేవారు
చాలామంది పనివాళ్ళకి గుండెలనిండా పాలే
వాళ్ళ పిల్లకి సరిపోగా మరో పిల్లకి కూడా సరిపోతాయి
మా అమ్మమ్మ లాటి వాళ్ళు పనివాళ్ళచేత పిల్లకి పాలు ఇప్పించేవారుట
వాళ్ళని పాలతల్లులు అనేవారుట
ఈ ట కారం ఎందుకంటే నాకు తెలీదు మా అమ్మమ్మ చెప్పేది
వాళ్ళకి తన స్వంత పిల్ల మీద ఉన్నట్టే ఈ పిల్ల మీద కూడా మమకారం ఉండేది
అప్పుడప్పుడు రోడ్డుమీద ఎదురైతే ఈ బాబు నా పాలు తాగే పెరిగేడు అని గర్వంగా చెప్పేవారు
వాళ్ళకి మాయ మర్మం స్వార్థం తెలీవు
రాను రాను నాగరికత పెరిగింది
అందానికి ప్రాధాన్యం పెరిగింది
పిల్లకి పాలిస్తే అందం పోతుందిట
అమ్మడూ నీకు తెలుసో తెలీదో కానీ వయసు పెరిగితే అందం తరుగుతుంది
నువ్వు పిల్లల్ని కన్నా కనకపోయినా పాలిచ్చినా ఇవ్వకపోయినా వయసు పెరుగుతుంది
అప్పుడు అందం తరుగుతుంది ఏ బ్యూటీ పార్లర్లూ నిన్ను కాపాడవు
ఐనా నాకు తెలీక అడుగుతాను ఇప్పుడు నీకు అందం ఎందుకు
మోటుగా చెప్పాలంటే మొగాళ్ళని ఆకర్షించడానికా
పెళ్లి అయిపోయింది పిల్లపుట్టింది ఇంకా ఆకర్షణ దేనికి
కట్టుకున్నవాడికి నువ్వు ఎలావున్నా ఒకటే
నువ్వు జాబ్ చేస్తున్నావు మంచిదే తప్పులేదు
కానీ కేవలం డబ్బుకోసం పిల్లని బలి చెయ్యకు
తల్లి పాలు లేని పిల్లలు ఆరోగ్యంగా ఉండరు
నీ జీతం పిల్ల జబ్బులకి డాక్టర్కి సరిపోతుంది
మళ్ళీ మొదటికే వస్తాను
డబ్బు తల్లీ పిల్ల మధ్య అనుబంధాన్ని తెంచేస్తోంది
నువ్వు ఆడదానివని చెప్పాలా
మంచి తల్లిగా ఉండమని చెప్పాలా
దయచేసి పిల్లల్ని అనారోగ్యం పాలు చెయ్యకండి
తల్లిగా బతకండి
-బీనా దేవి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ