NewsOrbit
వ్యాఖ్య

తల్లి రుణం!

అమ్మా  నువ్వు  పేపర్ చదవడం  టివి  చూడ్డం  మానెయ్యి  ప్రాణం హాయిగా  ఉంటుంది అన్నాడు  మా ఎంబీఏ  మనవడు
టీవీ  చూడ్డం  లేదురా  పేపర్ మాత్రం తిరగేస్తాను
మొన్న  పేపర్లో  చదివేను ఒకావిడకి నలుగురు  పిల్లలు
కట్టుకున్నవాడు  కాటికి వెళిపోయేడు  స్వంత ఇంట్లో ఒక్కర్తి  ఉంటోంది
పిల్లలదగ్గర  ఉండడం ఇష్టం లేదు
ఒక కొడుక్కి  ఆవిడ  ఇంటిమీద కన్ను పడింది
డబ్బు తల్లీ డబ్బు, అందుకే అన్నారు మాతా  పుత్రా  విరోధాయ  హిరణ్యాయ నమో  నమః  అని
నన్ను చెప్పనీరా  పెళ్ళాంతో  సహా తల్లి ఇంటికి వచ్చేడు
అక్కడితో అవలేదు ఆ ఇంటిని  తన పేర  రాయించేసుకున్నాడు
తరవాత  ఆవిడని బైటికి  తరిమేసేడు
ఇలాటివి ఎందుకు చదువుతావమ్మా  మనసు పాడవడానికి గాని
లేదురా మనుషులు యెంత  దిగజారిపోయేరో  తెలుస్తుంది
అసలు వాడు మనిషేనా
రావణుడు  రాక్షసుడు,  కానీ తల్లి అంటే విపరీతమైన  అభిమానం
మరి వీడు రాక్షసుడు కూడా కాదు కిరాతకుడు
ఏ తల్లీ  తన పిల్లలు చెడ్డవాళ్ళని చెప్పదు
ఎన్ని వెధవపన్లు చేసినా కడుపులో దాచుకుంటుంది
మరి ఆవిడ గుండెల్లో ఏ అగ్నిపర్వతాలు  బద్దలయ్యేయో
పోలీసులకి  కంప్లయింట్ ఇచ్చింది
వాడికి పెళ్ళానికి జైలు శిక్ష వేసేరు బావుందా
నువ్వు గుడ్డు  దశ  నుండి పిల్లవయ్యేవరకు తొమ్మిది నెలలు మోసింది
అసలు మొదట నీ  ఇల్లు  నీ  అమ్మ కడుపే
తనకి లేకపోయినా  నీకు పెట్టి పెంచింది  తల్లి తరవాతే  తండ్రి
తల్లి  ఋణం తీరదు
You owe your existence to her
నీకు  మాటలురానప్పుడు నీ మూగభాష  ఆవిడకే  తెలుసు
నువ్వు ఏడిస్తే  ఆకలికో  బట్టలు తడిసియో  ఆవిడకే  తెలుసు
ఒక్కమాటలో చెప్పాలంటే  నీ మనసెరిగిన  మనిషి తల్లి మాత్రమే
నీ  ఇష్టాయిష్టాలు ఆవిడకి తెలుసు
ఆవిడకి ఏవి కావాలో నీకు తెలీదు
నువ్వు చెట్టంత  ఎదిగేక  నీకు తోడు ఇస్తుంది
అంతవరకు  కోడి తన పిల్లల్ని రెక్కలకింద దాచుకున్నట్టు  నిన్ను తనగుండెల్లో దాచుకుంది
నీకు తోడు వచ్చిన చిన్నది నిన్ను డేగలాగా  తన్నుకు పోయింది
ఐనా ఆవిడా ఎవీ  అనలేదు
వాళ్ళు బావుంటే చాలు అనుకుంది
ఆఖరి క్షణంలోనైనా  నువ్వు ఉంటె బావుండును అనుకుంటుంది
కానీ ఆ చిన్న సంతోషం ఎంతమంది ఇస్తున్నారు
శలవు లేదు టికెట్ దొరకలేదు ఇవన్నీ కుంటి  సాకులు
ఫోన్లో  ఏడిస్తే సరి యెంత డబ్బు ఐనా  ఇస్తాను అన్ని సక్రమంగా చెయ్యండి అంటావు
ఆవిడకి కావలసింది డబ్బు కాదు నువ్వు
తల్లిని అభిమానించమని ఒకరు చెప్పాలా
తల్లితండ్రుల్ని  బాగా చూడకపోతే శిక్ష వేస్తావని చట్టం తెస్తారుట
ఆశీర్వచనాలకి  పిల్లలు పుట్టరు  చట్టాలకు మనుషులు మారరు
గోర్కీ  రాసిన a traitors mother అన్న కథలో ఆఖరి  మాటలతో ముగిస్తాను
తల్లి సృష్టిస్తుంది
అవసరమయితే  శిక్షిస్తుంది

  బీనా  దేవి 

Related posts

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Kia sonet: అతి తక్కువ ధరలో ఇండియాలో లాంచ్ అయిన కియా సోనెట్ కార్.. ఫెసిబిలిటీస్ ఇవే..!

Saranya Koduri

Oscar 2024: కొత్త సంవత్సరంలో ఆస్కార్ గెలుచుకోవడానికి సిద్ధమైన ఇండియన్ 12 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Allu Arjun: బన్నీ కి భారీ షాక్ ఇచ్చిన శ్రీ లీల… ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Venkatesh: వెంకీ మామా ఏంటి నీకు ఈ ఘోర అవ‌మానం… ఎంత పెద్ద త‌ప్పు చేశావ్‌..!

Saranya Koduri

Charmi: ” నీ హగ్గులు, లవ్ చాలా మిస్ అవుతున్నా.. తిరిగి మళ్లీ నా లైఫ్ లోకి రా “.. చార్మి సెన్సేషనల్ పోస్ట్..!

Saranya Koduri

Chiranjeevi: చిరు ఫామ్ హౌస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… సీఎం కి కూడా ఈ రేంజ్ ఉండదేమో..!

Saranya Koduri

Balakrishna: బాల‌య్య ప‌క్క‌న ఆ హీరోయిన్… ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్రా బాబు..!

Saranya Koduri

Junior NTR: నందమూరి ఫ్యామిలీ తారక్ ని అందుకే దూరం పెడుతుందా.. బయటపడ్డ అసలు నిజం..!

Saranya Koduri

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Saranya Koduri

Samantha: జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను అంటూ మరోసారి తన ఆవేదనను బయటపెట్టిన సమంత..!

Saranya Koduri

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Deepak Rajula

Google Discover: గూగుల్ డిస్కవర్ లో పొలిటికల్ కంటెంట్ అంతా రాజకీయ నాయకుల న్యూస్ మీడియా దే…ఎన్నికల తరుణం లో అక్కడా ఇక్కడా వీరే!

Deepak Rajula

ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ

Deepak Rajula

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment