NewsOrbit
Featured రాజ‌కీయాలు

జోగయ్య కాపు ఉద్యమ బాధ్యతలు..!! టార్గెట్ జగన్..!!

కాపు సంక్షేమ సేన ఏర్పాటు…

ముద్రగడ స్థానం భర్తీ చేస్తారా..కలసొచ్చేదెవరు

సీనియర్ పొలిటీషియన్..కాపు నేత చేగొండి హరి రామజోగయ్య కొత్త పాత్రకు సిద్దమయ్యారు. కాపు ఉద్యమం నుండి తప్పుకుంటున్నానని చెప్పిన తరువాత ఆ నాయకత్వ బాధ్యతలు ఎవరు తీసుకుంటరానే చర్చ సాగింది. ఇప్పుడు తాజాగా తెర మీదకు మాజీ మంత్రి..మాజీ ఎంపీ..నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన చేగొండి హరి రామజోగయ్య కొత్త బ్యానర్ తో ముందుకు వచ్చారు. కాంగ్రెస్..టీడీపీ..ప్రజారాజ్యం..వైసీపీలో నూ ఆయన పని చేసారు. ఇప్పుడు జగన్ కాపులను కొంత నగదు ఇస్తూ మభ్యపెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ల అంశంలో మోసం చేసిందని ఆరోపించారు. కాపులను బీసీలు గా గుర్తిస్తారా..లేక ఓసీలలో 10 శాతం ఈబీసీ కోటాలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించాలని జోగయ్య డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ఒక పుస్తకం రాసిన జోగయ్య అందులో వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నారనే విధంగా రాసుకొచ్చారు. అది పెద్ద ఎత్తున రాజకీయ వివాదానికి కారణమైంది. ఇప్పుడు జోగయ్య కొత్త జెండాతో..పాత అజెండాను మోసే బాధ్యత తీసుకోవటం వెనుక ఎవరున్నారనే చర్చ మొదలైంది. జోగయ్య వెనుక నిలిచేదెవరు..ఆయనతో కలిసొచ్చేదెవరు…అసలు ఏం జరుగుతోంది…

harirama jogaiah file photo
harirama jogaiah file photo

జోగయ్య కొత్త జెండా..కాసు సంక్షేమ సేన ఏర్పాటు..

రాజకీయంగా అనేక హోదాలు అనుభవించిన సీనియర్ నేత హరిరామ జోగయ్య ఇప్పుడు కాపు సంక్షేమం పేరుతో కొత్త జెండా ను..పాత అజెండాతో ఆవిష్కరించారు. కాపులకు చిరకాల డిమాండ్ గా పెండింగ్ లో ఉన్న కాపు రిజర్వేషన్ సాధన కోసం తాను కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా కాపు రిజర్వేషన్ల సాధన కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కాపు ఉద్యమం నాయకుడిగా నిన్న మొన్నటి వరకు ఉద్యమం నిర్వహించిన ముద్రగడ పక్కకు తప్పుకున్నారు. దీంతో..ఆ బాధ్యతలను హరిరామ జోగయ్య తీసుకోవటానికి సిద్దపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అనేక పార్టీల్లో పని చేసిన జోగయ్య కాపు ఉద్యమ నేతగా ఉండాలని భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కాపుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను జోగయ్య తప్పు బట్టారు. కాపులకు బడ్జెట్ లో ప్రతీ ఏటా రెండు వేల కోట్లు పెడతామని చెప్పిన జగన్…ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చిన విధంగానే కాపులకు ఇస్తున్నారంటూ..కాపులకు ప్రత్యేకంగా చేసిన మేలు ఏమీ లేదనేది జోగయ్య వాదన. కాపులకు విద్య…ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సాధించే వరకూ పోరాటం చేస్తామని జోగయ్య చెబుతున్నారు. దీని ద్వారా ఇప్పుడు జగన్ లక్ష్యంగా జోగయ్య ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, జోగయ్య తో కలిసి నడించేందుకు కలిసి వచ్చే వారు ఎవరు..పొలిటికల్ పార్టీలు ఎంత వరకు మద్దతుగా నిలుస్తాయనే చర్చ ఇప్పడుు మొదలైంది.

murdragada padmanabham file photo
murdragada padmanabham file photo

బీసీల్లో చేర్చాలి…లేకుంటే ఈబీసీ కోటాలో

హరి రామ జోగయ్య ఇప్పుడు కాపు ఉద్యమం పేరుతో కాపులను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జోగయ్య నాయకత్వానికి జనసేన అధినేత పవన్…ముద్రగడతో కలిసి పని చేసిన కాపు నేతలు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తారనేది వేచి చూడాల్సిన అంశం. అయితే, జగన్ 2019 ఎన్నికల ముందే పాదయాత్ర సమయంలో కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాని విషయమని..సుప్రీం ఉత్తర్వులు అడ్డు వస్తాయని.. సాధ్యం కాని హామీలు తానివ్వలేనని చెబుతూనే..అవకాశం ఉన్న మేర ప్రయత్నిస్తానని స్పష్టం చేసారు. అది కాపు ఓటింగ్ ను దూరం చేస్తుందని పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తం అయింది. ప్రతిపక్ష పార్టీలు సైతం దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి కాపు ఓటింగ్ ను వైసీపీకి దూరం చేసే ప్రయత్నం చేసారు. కానీ, కాపు ఓటింగ్ ప్రధానంగా ప్రభావం చూపే ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ మెజార్టీ సీట్లు గెలుపొందారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటికే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇస్తూ జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో కాపులను బీసీల్లో చేరుస్తూ ఒక తీర్మానం…అగ్రవర్ణాల రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇవ్వాలనే తీర్మానం..ఇలా రెండు తీర్మానాలు కేంద్రానికి పంపటం తో కేంద్రం వీటిలో ఏది ప్రభుత్వం విధానమో స్పష్టం చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక, ఇప్పుడు జోగయ్య కాపులను బీసీలక నష్టం లేకుండా బీసీల్లో చేర్చాలి..లేదా అగ్రవర్ణ పేదలకు కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లలో కాపులకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని పైన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సైతం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

author avatar
DEVELOPING STORY

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?