NewsOrbit
రాజ‌కీయాలు

విజయశాంతి పొలిటికల్ ట్విస్టులు..! వెళ్లడం, వదిలేయడం.. ఇంతేనా..!!

nothing there in vijayasanthi political moves

జాతీయ ఉత్తమ నటి, నెంబర్ వన్, లేడీ అమితాబ్ గా సినిమాల్లో ఆమె కీర్తి నలుదిశలా వ్యాపించింది. అయితే.. అదే కీర్తి ఆమెకు రాజకీయాల్లో తీసుకురాలేకపోయింది. తప్పటడుగులు కావొచ్చు.. అనుభవలేమి కావొచ్చు.. ఆవేశం కావొచ్చు.. కారణమేదైనా ఆమెకు సినిమాల్లో లభించిన విజయం, కీర్తి.. రాజకీయాల్లో దక్కలేదు. ఆమె సినిమా నాయకి.. రాజకీయ నాయకురాలు.. ‘విజయశాంతి’. స్వతహాగా దూకుడుగా ఉండే విజయశాంతి రాజకీయాల్లో అదే తీరును ప్రదర్శించలేదు. సొంతంగా పార్టీ పెట్టినా.. పార్టీలు మారినా రాజకీయాల్లో ఆమె రాత మారలేదు. తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా ఎదగాలన్న ఆమె ఆకాంక్ష అందని ద్రాక్షే అయింది.

nothing there in vijayasanthi political moves
nothing there in vijayasanthi political moves

పార్టీల్లో కీర్తి దక్కలేదు.. గుర్తింపూ తెచ్చుకోలేదు

‘తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి ఫైర్ బ్రాండ్.. ఆమె సేవలు ఉపయోగించుకోవాలి’ అనుకున్న పార్టీ కానీ నాయకులు గానీ లేరు. పోనీ.. ఉన్న పార్టీలోనే దూకుడుగా ఉందాం.. మన ఆలోచనలతో యాక్టివ్ గా ఉంటూ పార్టీ శ్రేణులను నడిపిద్దాం.. అని విజయశాంతికి లేదు. తెలంగాణ వాదం మొదలయ్యాక ఆమె ప్రత్యేక రాష్ట్ర సాధనకై స్టాండ్ తీసుకున్నారు. బీజేపీలో చేరారు. కొన్నాళ్లు ఉన్నారు. అయినా.. తన మార్కు చూపలేదు. అక్కడ ఉనికి చాటుకోవాలే తప్ప తనను గుర్తించాలనుకుంటే ఏం జరుగుతుంది.. పార్టీ ఆమెను పక్కన పెట్టేసింది. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ‘తల్లి తెలంగాణ’ పార్టీ పెట్టారు. పోనీ.. పార్టీని చుక్కానిలా నడిపించారా.. చుక్కానే లేని నావను చేశారు. కేసీఆర్ హోరులో విజయశాంతి నిలబడలేదు. టీఆర్ఎస్ లో కలిసిపోయారు. కేసీఆర్ ముందు సెలబ్రిటీ అంటే కష్టమే కదా. వచ్చేశారు.

తిరిగి తిరిగి చివరికి రాజకీయ పుట్టిల్లే..

మిగిలిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిక వరకూ ఘనమే. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ లో నేనున్నానని ఉనికి కాపాడుకోవడమే. కాంగ్రెస్ లో గుర్తింపంటే.. రోడ్డు మీద జాతర చూసేవాడిలో ఏనుగు దండేసినట్టే. దీంతో ఆమె అక్కడ యాక్టివ్ కాలేదు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అసలు.. సినీ సెలబ్రిటీగా స్టార్ కాంపెనయిర్ గా వాళ్లు లెక్కలోకి కూడా తీసుకోలేదు. మొత్తానికి కాంగ్రెస్ ను వదిలేశారు. తిరిగి తిరిగి మళ్లీ రాజకీయ పుట్టిల్లు బీజేపీలోకే వెళ్లిపోయారు. ఇప్పుడెందుకు బీజేపీ అంటే.. అది ఆమె ఇష్టం.. అనే సమాధానం తప్ప ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి.

author avatar
Muraliak

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?