24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
రివ్యూలు

HIT 2 Movie Review: అడవి శేష్ “హిట్ 2” మూవీ రివ్యూ..!!

Share

HIT 2 Movie Review:  నాచురల్ స్టార్ నాని నిర్మాతగా అడవి శేష్ హీరోగా తెరకెక్కిన “హిట్ 2” డిసెంబర్ రెండవ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.
నటీనటులు:

అడవి శేష్, మీనాక్షి, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, శ్రీనాథ్ మాగంటి, శ్రీకాంత్ అయ్యంగార్.

డైరెక్టర్: DR. శైలేష్ కొలను.
ప్రొడ్యూసర్: ప్రశాంతి త్రిపరనేని, నాని.
మ్యూజిక్ డైరెక్టర్: ఎం ఎం శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి.
సినిమాటోగ్రఫీ: ఎస్ మణికందన్.
ఎడిటర్: గారి బిహెచ్.

పరిచయం:

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన “హిట్” సినిమాకు సీక్వెల్ అడవి శేష్ నటించిన “హిట్ 2”. ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి త్రిపరనేని సంయుక్తంగా కలిసి నిర్మించడం జరిగింది. శైలేష్ కొలను దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ నేపధ్యంలో రావడం జరిగింది. “హిట్ 2” సినిమాలో సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు శేష్ చేసిన ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ సాగుతోంది. అడవి శేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో స్క్రీన్ మీద చెలరేగిపోయాడు. డిసెంబర్ రెండవ తారీకు విడుదలైన ఈ సినిమా.. అన్నిచోట్ల మంచి టాక్ రావడంతో సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.

hero Adavi Sesh hit 2 movie review
Hit 2 Movie Review
స్టోరీ:

వైజాగ్ ఎస్పీ కృష్ణదేవ అలియాస్ కేడి (అడవి శేష్) ఉద్యోగం చాలా సులువుగా..కూల్ గా చేస్తూ ఉంటాడు. తన దగ్గరికి ఎటువంటి కేసు వచ్చినా పెద్దగా సీరియస్ గా తీసుకొని వ్యక్తిత్వం. ఈ క్రమంలో ఆర్య (మీనాక్షి చౌదరి) మహిళా సంఘాలు ఇంకా చేనేత కార్మికులు అంటూ ఉద్యమాల తరహాలో తిరుగుతూ ఉంటది. ఆర్య, అలియాస్ ఎస్పీ కేడీ మధ్య లివ్ ఇన్ రిలేషన్ లో ఉండటం జరుగుద్ది. ఎంతో ఆహ్లాదకరంగా… సాఫీగా సాగుతున్న కేడి.. ఆర్య జీవితంలోకి… ఒక సీరియల్ కిల్లర్ ఎంట్రీ ఇవ్వడం జరుగుద్ది. ఇక ఇదే సమయంలో నగరంలో సంజన అనే అమ్మాయి అతికిరాతకంగా దారుణంగా హత్యకు గురవుతద్ది. ఈ క్రమంలో పోలీసుల విచారణలో తల మాత్రమే సంజనాది… మిగతా శరీర భాగాలు ఇతర అమ్మాయిలకు సంబంధించివి అని.. సరికొత్త విషయం బయటపడద్ది. ఈ కేసు రాష్ట్రంలో నగరంలో సంచలనం రేపొద్ది. దీంతో ఈ కేసును చేదించడానికి.. ఎస్పి కేడి చేసిన ప్రయత్నాలు ఏమిటి..? సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలో.. రాందాస్ (హర్షవర్ధన్) గురించి తెలుసుకున్నది ఏమిటి..? కుమార్ (సుహాస్) పాత్ర ఎటువంటి విషయాలకు దారితీస్తుంది..? సీరియల్ కిల్లర్ కన్ను ఆర్య మీద ఎప్పుడు పడింది..? ఎందుకు పడింది..? ఆర్య కేడి ఇలా మధ్య ఆ సీరియల్ కిల్లర్.. ఎలా వచ్చాడు..? ఆర్యాను ఎస్పీ కేడీ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ.

hero Adavi Sesh hit 2 movie review
Hit 2 Movie Review
విశ్లేషణ:

ఎస్పీ కేడీ పాత్రలో అడివి శేష్.. ప్రారంభంలో కాస్త ఎటకారం ఉన్నాగాని తర్వాత డ్యూటీలో సిన్సియారిటీ.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా అద్భుతంగా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు. ముఖ్యంగా ప్రేమించిన అమ్మాయి పట్ల కేరింగ్ ఎలా తీసుకున్నాడు అనేది అన్ని యాంగిల్స్ లో డైరెక్టర్ బాగా చూపించాడు. మీనాక్షి చౌదరి తన పరిధి వరకు సినిమాకి అద్భుతంగా తన నటనతో మంచి బూస్ట్ ఇచ్చింది. ఇంకా రావు రమేష్ సైతం తన సన్నివేశాలకు 100% ఇచ్చాడు. మిగతా నటీనటులు చూస్తే మాగంటి శ్రీనాథ్, పోసాని, శ్రీకాంత్ అయ్యంగార్.. తనికెళ్ల భరణి అందరూ కూడా.. అద్భుతంగా తమ పాత్రలకు న్యాయం చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో కథ సాగుతున్నప్పటికీ.. సన్నివేశాలను ముందుగా చెప్పేసేంత లూప్ లు ఉన్నాయి. దీంతో మొదటి భాగం కాస్త స్లోగా  అనిపించిన కేసును చేదించే విధానం మరియు కథని నడిపించే తీరు కాస్త ఇంట్రెస్టింగ్ కలిగించింది. సెకండాఫ్ నుండి సినిమా చాలా స్పీడ్ గా ముందుకు కదులుతుంది. సీరియల్ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేషన్ లో బయటపడే సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయి. ఇక క్లైమేక్స్ లో తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో యధావిధిగా  ముందు మంచివాడిగా కనిపించే పాత్ర చివరకి పైశాచిక రూపంలో చూపించే విధానమే సేమ్ రొటీన్ లైన్..”హిట్ 2″ లో రిపీట్ అయింది. క్లైమాక్స్ ఆతరహాలోనే చిత్రీకరించారు. అంత సైకోగా భయంకరమైన సన్నివేశాలను చూపించినప్పటికీ క్లైమాక్స్ లో ఆ తరహా రౌద్రం విలన్ పేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోవడం  మైనస్. ఇదంతా పక్కన పెడితే సినిమా చివరిలో మూడో పార్ట్ ఉందని..అందులో…నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు… క్లైమాక్స్ లో చూపించి ప్రేక్షకులలో కొత్త ఆసక్తిని పెంచేశారు.

 

ప్లస్ పాయింట్స్:

అడవి శేషు నటన.
మీనాక్షి చౌదరి లుక్స్.
సెకండాఫ్.
ఇంటర్వెల్.
సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్:

సీన్స్ ముందుగానే గెస్ చేయగలగటం.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
విలన్.
క్లైమాక్స్.

hero Adavi Sesh hit 2 movie review
HIT 2 Movie Review
మొత్తంగా :

సినిమా కాస్త స్లో అయినా గాని సెకండాఫ్..తో అడవి శేష్ వన్ మ్యాన్ షో చూపించాడు.

రేటింగ్: 3/5

 

 


Share

Related posts

`గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` రివ్యూ

Siva Prasad

`రణరంగం` రివ్యూ& రేటింగ్

Siva Prasad

Meet Cute: మీట్ క్యూట్ రివ్యూ.. అంతా క్యూటేనా.!?

bharani jella