NewsOrbit
రివ్యూలు

ఎన్టీఆర్ బయోపిక్ రివ్యూ

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కి రిలీజ్ ముందే భారీ అంచనాలు సృష్టించిన సినిమా ‘ఎన్టీఆర్’, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఎంత వరకూ చూపించారు? ఎక్కడ ఎండ్ చేశారు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ రివ్యూ చూసేయండి.
ఎన్టీఆర్ సినిమాలోని మొదటి భాగం కథానాయకుడు రిలీజ్ అయ్యింది, నందమూరి తారక రామారావు సినీ ప్రయాణంతో మొదలు పెట్టి, రాజకీయ ప్రవేశం వరకూ చూపించిన ఈ సినిమాలో క్రిష్ తన కాన్సన్ట్రేషన్ అంతా బసవతారకమ్మ-నందమూరి తారక రామారావు మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రెజెంట్ చేయడానికే ప్రయత్నించాడు. కాన్సర్ హాస్పిటల్ లో బసవతారకమ్మకి కాన్సర్ అని చెప్పే పాయింట్ తో మొదలైన ఈ సినిమా, హరికృష్ణగా కళ్యాణ్ రామ్ ని ఇంట్రడ్యూస్ చేసి.. ఆ తర్వాత నందమూరి తారక రామారావుని ప్రెజెంట్ చేయడంతో కథ ప్రయాణం మొదలవుతుంది. సినిమాల్లోకి రావాలన్న ఎన్టీఆర్ నిర్ణయం ఎలా తీసుకున్నారు, వెండితెర ఇలవేల్పుగా ఒక వెలుగు వెలిగిన మనిషి, కెరీర్ స్టార్టింగ్ లో ఎలాంటి కష్టాలు పడ్డాడు… వరస సినిమాలతో ఎలా నిలబడ్డాడు అనేది కథానాయకుడు మెయిన్ పాయింట్, దీన్ని క్రిష్ సమర్ధవంతంగా పూర్తి చేశాడు. అతని రాకతో కొత్త కళ తెచ్చుకున్న ఎన్టీఆర్ సినిమా.. ఆధ్యంతం ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

రామారావు జీవితాన్ని రెండు భాగాలుగా చూపించాలన్న క్రిష్, మొదటి భాగంలో సినీ ప్రయాణాన్ని చూపించడానికి, ఎన్టీఆర్ రాజకీయ పునాదికి అడుగులు పడిన విధానాన్ని చూపించడానికి కావాల్సినంత సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలో సినిమా చూసే ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టించినా కూడా అదే కథన ప్రయాణం కాబట్టి చూడక తప్పదు. కథానాయకుడు ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ఇదే అనిపిస్తుంది, యంగ్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కొంచెం ఎబెట్టుగా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ లో మాత్రం అద్భుతంగా సెట్ అయ్యాడు. తెరపై ఎన్టీఆర్ నే చుస్తున్నామా అనే ఫీలింగ్ కలిగింది అంటే అది కచ్చితంగా క్రిష్ గొప్పదనమే. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్, మేకప్ ఇలా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్స్ లో ప్రతి టెక్నీషియన్ తన వర్క్ కి 100 పర్సెంట్ న్యాయం చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణతో ఓవర్ యాక్షన్ చేయించకుండా, సన్నివేశానికి తగ్గట్లు ఔట్పుట్ రాబట్టుకోవడంలో క్రిష్ సక్సస్ అయ్యాడు కాబట్టి ఎన్టీఆర్ సినిమాకి ఇప్పుడు వచ్చే కాంప్లిమెంట్స్ అన్నింటికీ అతను పూర్తిగా అర్హుడు.

తన తల్లిదండ్రుల కథని తెరపై చూపించాలనుకున్న బాలకృష్ణ, ఎక్కడా కమర్షియల్ హంగులకి పోకుండా.. కథగానే చూపించాలన్న తాపత్రయం బాగుంది, తండ్రి పాత్రకి తను మాత్రమే న్యాయం చేయగలడని ప్రూవ్ చేసిన బాలయ్య,… అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని ఎన్టీఆర్ ని ఎలివేట్ చేసే డైలాగులు చుట్టూ పక్కల ఆర్టిస్టులతో, టెక్నీషియన్స్ తో చెప్పించిన విధానం కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా ఫ్లోలో వెళ్లిపోతుంది. ఇప్పటికే పౌరాణిక పాత్రలు  పోషించిన బాలయ్య, మరోసారి ఆ లుక్స్ లో తనకు తానే సాటి అని నిరూపించాడు. బాలకృష్ణ నటనకి ఈ సినిమా నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలి. బాలకృష్ణ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విద్యా బాలన్ గురించే. బసవతారకమ్మ పాత్రలో ఆమె పూర్తిగా ఒదిగిపోయింది.భాష రాకున్నా విద్యా బాలన్ నటించిన విధానం అందరినీ మెప్పిస్తుంది, ప్రత్యేకించి  కొడుకు మరణించిన సన్నివేశంలో విద్యా బాలన్ చూపిన నటన ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. తారకమ్మ గురించి పెద్దగా తెలియని వారు ఈ సినిమా చూస్తే ఆమె విద్యా బాలన్ లాగే ఉండేదా అనిపించేంతలా, బాలన్ నటించి మెప్పించింది. గెస్ట్ రోల్స్ అందరూ తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. కనిపించింది కొద్దిసేపే అయినా దగ్గుబాటి రానా… యాక్టింగ్ లో మెప్పించాడు. తన ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. ఇక హరికృష్ణ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్, తండ్రిలోని ఆవేశాన్ని బాగా పట్టుకున్నాడు. కళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివరీ చూస్తే హరికృష్ణనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.

ఇక అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో కనిపించిన సుమంత్ తాతని తలపించాడు. ఎన్టీఆర్-ఎఎన్నార్ మధ్య ఉండే బంధాన్ని ఈ సినిమా చూపించింది. ఆ తర్వాత శ్రీదేవిగా కనిపించిన రకుల్, సావిత్రమ్మగా కనిపించిన నిత్యామీనన్ తెరపై చాలా అందంగా కనిపించారు. ఏది ఎంత వరకూ చూపించాలో అంత వరకే చూపించి, ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజకీయ ప్రవేశానికి ఊతమిచ్చేలా జరిగిన సంఘటనలు ఏంటి? ఆయన పార్టీ ఎక్కడ ఎలా అనౌన్స్ చేశాడు అనేది చూపించడంతో కథానాయకుడు ముగిసింది. మొత్తానికి ఎన్టీఆర్ లోని మొదటి భాగం కథానాయకుడు సినిమా అక్కడక్కడా బోర్ కొట్టించినా కూడా ఓవర్ ఆల్ గా మంచి ఎండింగ్ ఇచ్చింది. చివరి 20 నిముషాలు ఈ సినిమాకి ప్రధాన బలం, మహానాయకుడు సినిమాకి అవసరమైన బేస్ ని ఏర్పాటు చేయడంలో కథానాయకుడు సినిమా చాలా హెల్ప్ అయ్యింది. మరి ఇప్పుడు వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది ఫిబ్రవరి 7న తెరపైనే చూడాలి.

Related posts

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

‘బహుముఖం’ మూవీ రివ్యూ..

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Kismat First Review: కిస్మత్ ఫస్ట్ రివ్యూ… ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసిన ఈ క్రైమ్ కామెడీ ఏ విధంగా ఉందంటే..!

Saranya Koduri

Bhoothakaalam Review: భూతకాలం ఫస్ట్ రివ్యూ.. ప్రేక్షకులను భయానికి గురి చేసే ఈ మలయాళం మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Lambasingi movie review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ..

siddhu

Bhimaa: థియేట‌ర్స్ లో దుమ్ములేపుతున్న భీమా.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

kavya N

Valari Movie Review: వళరి రివ్యూ.. ఓటీటీలో ద‌డ పుట్టిస్తున్న ఈ దెయ్యాల సినిమా ఎలా ఉందంటే?

kavya N

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Chaari 111 review: ” చారి 111 ” మూవీ రివ్యూ వచ్చేసిందోచ్.. వెన్నెల కిషోర్ హీరోగా హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Sandeep: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మనోడు యాక్టింగ్ ఇరగదీసాడుగా..!

Saranya Koduri

Lal Salam: రజిని ” లాల్ సలాం ” రివ్యూ… వామ్మో ర‌జ‌నీ నీకో దండం…!

Saranya Koduri

Eagle: రవితేజ “ఈగల్ ” ట్విట్టర్ రివ్యూ.. మాస్ మ‌హరాజ్ బొమ్మ హిట్టా…ఫ‌ట్టా…!

Saranya Koduri

యాత్ర 2 ఫ‌స్ట్ రివ్యూ… గూస్‌బంప్స్ మోత‌… గుండెలు పిండే సెంటిమెంట్‌..!

Saranya Koduri

Leave a Comment