ఆడియో ఉత్పత్తులను తయారు చేసి అందివ్వడంలో బోట్ కంపెనీ పేరుగాంచింది. ఆ కంపెనీకి చెందిన ఆడియో ప్రొడక్ట్స్ తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అవి వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదే కంపెనీ కొత్తగా బోట్ స్టార్మ్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుండడం విశేషం. దీంట్లో అనేక ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
బోట్ స్టార్మ్ స్మార్ట్ వాచ్‌లో 1.3 ఇంచుల కర్వ్డ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఈ వాచ్‌లో హార్ట్ రేట్, ఎస్పీవో2 సదుపాయాలు ఉన్నాయి. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. మెటల్‌తో ఆ వాచ్‌ను రూపొందించినందున ఎక్కువ కాలం మన్నుతుంది. 100కు పైగా పర్సనలైజ్డ్ కస్టమ్ వాచ్ ఫేస్‌లను దీంట్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఇచ్చారు.
రోజులో 24 గంటలపాటు నిరంతరాయంగా ఈ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్, హార్ట్ రేట్ లను చెక్ చేసుకోవచ్చు. మహిళలు తమ పీరియడ్స్ ను ట్రాక్ చేయవచ్చు. అందు కోసం మెన్స్ట్రుయేషన్ సైకిల్ ట్రాకర్‌ను ఇచ్చారు. 9 రకాల బిల్టిన్ యాక్టివిటీ ట్రాకర్లను ఇచ్చారు. వాకింగ్, రన్నింగ్, హైకింగ్, క్లైంబింగ్, ఫిట్ నెస్ ట్రెడ్ మిల్, యోగా, డైనమిక్ సైక్లింగ్ వంటి యాక్టివిటీలను ఈ వాచ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు.
ఈ వాచ్ దాదాపుగా 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. 210 ఎంఏహెచ్ బ్యాటరీ దీంట్లో ఉంది. ఈ వాచ్‌కు సిలికాన్ స్ట్రాప్ ను ఇచ్చారు. దాన్ని మార్చుకోవచ్చు. యాక్టివ్ బ్లాక్, బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ లభిస్తోంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ లేదా బోట్ ఆన్ లైన్ స్టోర్ లలో రూ.1,999 ధరకు కొనవచ్చు.