NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రైతుల ఆందోళన ఫలించింది .. జగిత్యాల మాస్టర్ ప్లాన్ పై కౌన్సిల్ కీలక నిర్ణయం

కామారెడ్డి – జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశంపై రైతుల పోరాటం ఫలిచింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలతో మున్సిపల్ పాలకవర్గం దిగివచ్చింది. జగిత్యాల జిల్లా మాస్టర్ ప్లాన్ ను రద్దు చూస్తూ శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఆరు గ్రామాల రైతులు, గ్రామస్తులు ఆందోళనలు చేస్తుండగా, వీరి ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాలు మద్దతు తెలియజేశాయి.

kamareddy jagtial municipal Council passed resolution cancel master plan

గత ఏడాది డిసెంబర్ 15న మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. రైతుల నిరసనతో మంత్రి కొప్పుల ఈశ్వర్ .. మాస్టర్ ప్లాన్ ను సవరిస్తమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ కౌన్సిల్ లో రద్దు తీర్మానం ప్రవేశపెట్టడం, ఎమ్మెల్యే సంజయ్ కుమర్, చైర్ పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ రద్దుకై ఇవేళ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేసం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ తో కలిపి మొత్తం 49 మంది వార్డు కౌన్సిలర్లు సమావేశానికి హజరైయ్యారు.

సమావేశం అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు ఆందోళన చేస్తున్న కారణంగా దానిపై స్పష్టత కోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. డిజైన్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించాయని ఆరోపించారు. ఇప్పటికే ఎమ్మెల్యే కూడా దీనిపై చెప్పారన్నారు. తాము రైతుల వెంటే ఉంటామనీ, బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమనీ, ఎవరికీ అన్యాయం జరగదని అన్నారు. ప్రతిపక్షాల మాటలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. 60 రోజుల పాటు అభ్యంతరాలు తీసుకున్నామనీ, వాటిని కూడా ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండస్ట్రియల్ జోన్ చేయమనీ, రైతులు ఆందోళన విరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ కు దక్కని ఊరట .. జీవో నెం.1పై విచారణలో సుప్రీం కోర్టు ఏమన్నదంటే..?

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju