32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News OTT రివ్యూలు

Kaapa Telugu Movie Review: పృధ్విరాజ్ సుకుమారాన్ “కాపా” తెలుగు మూవీ రివ్యూ..!!

Share

Kaapa Telugu Movie Review: నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన “కాపా” స్ట్రీమింగ్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ బాగా ఆదరణ దక్కించుకోవడంతో తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది.

Prithviraj Sukumaran Kaapa Telugu Movie Review
Prithviraj Sukumaran

సినిమా పేరు: కాపా
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, అన్నా బెన్.. తదితరులు.
దర్శకుడు: షాజి కైలాస్
సంగీతం: డాన్ విన్సెంట్, జెక్స్ బిజొయ్.
నిర్మాత: డాల్విన్ కురియకోస్, జిను వి. అబ్రహం, దిలిష్ నాయిర్, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ ఆనంద్ కుమార్.
సినిమాటోగ్రఫీ: జోమన్ టి.జాన్.
ఓటిటి: నెట్ ఫ్లిక్స్.

పరిచయం:

ఓటిటి అందుబాటులోకి వచ్చాక ఎంటర్టైన్మెంట్ లవర్స్ కి ప్రతివారం పండగే. ఇతర భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఇంట్లో కూర్చుని చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతివారం వెరైటీ కంటెంట్ లతో చాలా సినిమాలు ఓటీటీ లలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ వారం మలయాళం లో సూపర్ డూపర్ హిట్ అయినా “కాపా” నెట్ ఫ్లిక్స్ లో విడుదల కావడం జరిగింది. పృథ్వీరాజ్ సుకుమారన్, అపర్ణా బాలమురళి, అసిఫ్ అలీ, అన్నా బెన్ తదితరులు నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో..? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.

Prithviraj Sukumaran Kaapa Telugu Movie Review
Kaapa Telugu Movie Review
స్టోరీ:

బెంగళూరులో సాఫ్టువేర్ ఉద్యోగం చేసే ఆనంద్(ఆసిఫ్ అలీ) తిరువనంతపురంకి చెందిన బిను త్రివిక్రమన్ (అన్నాబెన్) ని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆనంద్ ఉద్యోగం రీత్యా బెంగళూరు నుండి బిను త్రివిక్రమన్ సొంత ఊరు తిరువనంతపురంకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది. ఈ ఊరు గ్యాంగ్ స్టార్స్ కి అడ్డా. రెండు గ్రూపులు ఇక్కడ ఎప్పుడు తలబడుతూ ఉంటాయి. దీంతో కేరళ ప్రభుత్వం గ్యాంగ్ స్టార్స్ గొడవలు అరికట్టడానికి కాపా(కేరళ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) అమలు చేయటం జరుగుద్ది. ఈ క్రమంలో పోలీస్ వద్ద నేర చరిత్ర కలిగిన వారి లిస్టు ఉంటది. ఊరిలో ఎక్కువుగా ఎవరెవరు గొడవలు, అల్లర్లకు పాల్పడతారు.. వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి. అయితే పోలీస్ ల వద్ద ఉన్న లిస్టులో తన భార్య బిను త్రివిక్రమన్.. పేరు ఉందని ఆనంద్ తెలుసుకుంటాడు. దీంతో తన భార్య ప్రాణానికి ఎటువంటి హాని జరగకూడదని ఆ ప్రాంతానికి చెందిన గ్యాంగ్ స్టార్ మధు (పృధ్వీరాజ్) రక్షణ కోరడం జరుగుద్ది. ఆనంద్ భార్య విషయంలో మధు భార్య (అపర్ణ బాలమురళి) ఇంకా తిరువనంతపురంకి చెందిన కలెక్టర్ సాయం చేయడానికి రంగంలోకి దిగుతారు. మరి ఆనంద్ తన భార్యని పోలీసుల వద్ద ఉన్న “కాపా” లిస్టు నుండి తొలగించగలిగాడా,,? ఆనంద్ భార్య విషయంలో గ్యాంగ్ స్టార్ మధు అతని భార్య ఎందుకు అంత ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు..? అసలు ఆనంద్ భార్య గతం ఏమిటి..? అనేది సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రెండు గ్రూపుల ఆధిపత్య పోరుతో చిత్ర కథనం.. రొటీన్ స్టోరీ మాదిరి అనిపించింది. గతంలో ఇదే తరహా స్టోరీ లైన్ తో అనేక సినిమాలు వచ్చాయి. “కాపా” అదే ఫ్లేవర్ కంటెంట్ ఉండటంతో పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. అయితే సినిమా స్టోరీ స్టార్టింగ్ లో ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురికావడంతో అసలు ఏం జరిగింది అన్న ఆత్రుత చూసే ప్రేక్షకులలో కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కానీ ఆ యొక్క ఇంట్రెస్ట్ నీ …కొనసాగించడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. స్తోరీలో  పాత్రలు  పరిచయం అయ్యే  కొద్ది కథనం.. బలహీనం కావటం సినిమాకి పెద్ద మైనస్. రెండు గ్యాంగ్ స్టార్ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరులో బలమైన ఎమోషన్ ఇంకా ఆకట్టుకున్న పాయింట్ ఎక్కడ లేదు. రొటీన్ కమర్షియల్ తరహాలో సన్నివేశాలు సాగాయి. కొత్త కొత్త పాత్రలు కథలో ఎంటర్ అవుతున్న గాని… ఎక్కడా కూడా చూసే ప్రేక్షకుడికి ఔరా అనిపించే సన్నివేశాలు.. సినిమాలో లేవని చెప్పవచ్చు. భార్యను కాపాడుకునే భర్త.. చేసే ప్రయత్నాలు.. ఏ రీతిగా దారితీసాయి అన్న కథనంతో సాగిన గాని.. రొటీన్ స్టోరీగా “కాపా” అనిపిస్తోంది. పృధ్వీరాజ్ పాత్ర కూడా పెద్దగా సినిమాలో స్ట్రాంగ్ గా ఏమి కూడా కనిపించదు. కేవలం రెండు ఫైట్స్ సన్నివేశాలతో.. పృథ్వీరాజ్ తేలిపోతాడు. మధు ఫ్లాష్ బ్యాక్ లో కూడా పెద్దగా హైలెట్ సన్నివేశాలు ఏమీ ఉండవు. సినిమాలో కొన్నిచోట్ల వచ్చే ట్విస్ట్ లు కొద్దిగా ఆకట్టుకుంటాయి. అయితే చివరిలో సినిమాకి సీక్వెల్ ఉంటుందన్నట్టుగా క్లైమాక్స్ ముగించడం జరిగింది. “కాపా” మొత్తంగా చూసుకుంటే రొటీన్ కమర్షియల్ స్టోరీ అని చెప్పవచ్చు.

Prithviraj Sukumaran Kaapa Telugu Movie Review
Kaapa Telugu Movie Review
పాజిటివ్ పాయింట్స్:

బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
నటీనటుల సహజ నటన.
క్లైమాక్స్.

Prithviraj Sukumaran Kaapa Telugu Movie Review
Prithviraj Sukumaran “Kaapa” Movie Review
నెగిటివ్ పాయింట్స్:

స్టోరీ.
స్లోగా కథ నడిచే విధానం.

మొత్తంగా: “కాపా” కమర్షియల్ రొటీన్ డ్రామా కొత్తదనం ఏమీ లేదని చెప్పవచ్చు.
రేటింగ్: 1.5/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Share

Related posts

Pawan Kalyan – NBK: బాలకృష్ణ సినిమా సెట్స్ లో సందడి చేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

kavya N

“RRR” పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..!!

sekhar