NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Politics: తెలంగాణలో ఎవరికి ఎన్ని సీట్లు..!? షేక్ చేస్తున్న సర్వే రిపోర్టు..!

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు ఏపికి భిన్నంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మాత్రమే, జనసేన పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఇంకా ఎదగలేదు. పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా పరిపక్వత సాధించలేదు. పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఈ కారణంగా ప్రస్తుతం ఏపిలో రెండు పార్టీలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ విషయానికి వస్తే మూడు పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. 2018 లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ బలంగా కనిపించినప్పటికీ కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. పెద్ద పెద్ద బీజేపీ నాయకులు కూడా ఓడిపోయారు. అప్పుడు టీఆర్ఎస్ గాలి అంత బలంగా వీచింది.

Telangana Politics 2023 elections
Telangana Politics 2023 elections

Read More: CM YS Jagan: రాజధాని విశాఖపట్నం ఖాయం..జగన్ టేబుల్ పై ఓ ప్లానింగ్..?

2023 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎన్నికలు..?

కేసిఆర్ ఆనాడు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, సానుభూతి అన్నీ కలిసి వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కొత్త పుకార్లు వినబడుతున్నాయి. 2022 లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు. జూన్ నుండి అక్టోబర్ మధ్యనే అసెంబ్లీ రద్దు చేస్తారు అని కొన్ని పుకార్లు వస్తున్నాయి. అవి నిజమవుతాయో కాదో పూర్తి ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు కఛ్చితంగా 2023లోనే ఉంటాయని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం డిసెంబర్ 2023 వరకూ ఉండగా ఆరు నెలలో, తొమ్మిది నెలలో ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. 2023 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన మరో సంవత్సరంలో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి.

Read More: YS Viveka: ఒక పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి కడపకు కీలక అధికారి..!

Telangana Politics: హంగ్ అసెంబ్లీ అంటూ ఓ సర్వే రిపోర్టు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా లేక ఆరు నెలలో సంవత్సరం తరువాత ఎన్నికలు జరిగినా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీ అధికారం చేపట్టనున్నది అనేది కీలక అంశమే. అయితే ఇటీవల ఓ సర్వే సంస్థ అందించిన వివరాల ప్రకారం..ఏ రాజకీయ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాదు. హంగ్ అసెంబ్లీ వస్తుంది అని చెప్పింది. ఏకపక్షంగా టీఆర్ఎస్ అధికారంలోకి రాదు. మూడు పార్టీలను పోల్చుకుంటే టీఆర్ఎస్ కొంత గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. టీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం బాగా తగ్గిపోతుంది అనేది ఆ సర్వే వెల్లడించింది. దానికి కారణం కేసిఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడం, అవినీతి, బీజేపీ ఎదగడం, నిరుద్యోగ సమస్య లాంటివి చెబుతున్నారు. టీఆర్ఎస్ కు మొత్తంగా 38 నుండి 44 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. బీజేపీకి 40 నుండి 44 స్థానాలు వస్తాయని చెబుతోంది. ఈ లెక్కన టీఆర్ఎస్, బీజేపీ చాలా దగ్గరగా ఉన్నట్లు ఈ సర్వే లెక్కలు వేసింది. కాంగ్రెస్ పార్టీకి 25 నుండి 30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్లు ఈ సర్వే సంస్థ అంచనా వేసింది.

Telangana Politics: అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్..?

ఆ సర్వే సంస్థ అంచనాలను పక్కన పెడితే.. ‘న్యూస్ ఆర్బిట్’ అంచనా ప్రకారం బీజేపీకి 40 స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. బీజేపీకి 20 లోపే స్థానాలు వస్తాయి. 20లోపు సీట్లు బీజేపీకి వస్తే తెలంగాణలో బాగా వచ్చినట్లే లెక్క. అధికార టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఏదో ఒక పక్షానికి వెళ్లే పరిస్థితి లేదు. రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకుంటాయి. ఇదే టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశంగా పేర్కొనవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి ఎన్నికల్లో లబ్దిపొందటం కేసిఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు బీజేపీనే టీఆర్ఎస్ ఓ అస్త్రాన్ని ఇచ్చింది. ప్రధాని మోడీ రాజ్యసభలో మాట్లాడిన మాటలనే టీఆర్ఎస్ ఆయుధంగా వాడుకుంటున్నాయి. బీజేపీని గెలిపిస్తే తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేస్తారు అంటూ మంత్రులే ప్రచారం చేస్తున్నారు. త్రిముఖ పోటీ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ చాలా ఈజీగా 50కిపైగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. బీజేపీ 15 నుండి 20 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా 15 నుండి 20 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. వామపక్షాలు, టీడీపీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ఛరిష్మా తో రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్లు లాంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బీజేపీకి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ సిటీ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీకి కొంచెం ప్లస్ ఉండే అవకాశాలు ఉంటాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju