Karthika Deepam 2 April 17th 2024 Episode: పారిజాతం దీపని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడం లేదని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బంటు వస్తాడు. దీప ని గజగజ వణికించేసానని బిల్డప్ ఇస్తాడు. ఈ ఇంటికి మెయిన్ పిల్లర్ లాంటి దాన్ని అది నన్నే పూచిక పుల్లలాగా తీసేసింది. అది గుడిలో అమ్మోరు లాంటిది. అలాంటిది నువ్వు దాన్ని వనికించావంటే నమ్మాలా అని పారు అంటుంది. కార్తీక్, జ్యోత్స్న షాపింగ్ కి వెళ్లేందుకు బయటకు వస్తారు. అప్పుడే కారు దగ్గర శౌర్య ఉండి లోపలికి చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావ్ అంటే కారులో కిటికీ చూస్తున్నానని చెబుతుంది. ఎందుకు పెడతారని అడుగుతుంది. అది సన్ ప్రూఫ్ అని దాని గురించి కార్తీక్ శౌర్యకి చెబుతాడు. అందులో నేను రావచ్చా అంటే సరే మీ అమ్మకి చెప్పి రా అని అంటాడు కార్తీక్. మా అమ్మ నేను మాట్లాడుకోవడం లేదు. మా ఇద్దరికీ పెద్ద గొడవ జరిగిందని చెబుతుంది శౌర్య.
నేను చెప్పను నువ్వు వెళ్లి చెప్పు అని కార్తీక్ ని అంటుంది. ఇద్దరూ కాసేపు మంచి ఫన్ క్రియేట్ చేస్తారు. దగ్గరకు వెళ్లడానికి కాస్త భయపడతాడు కార్తీక్. కార్తీక్ భయం భయంగా దీప దగ్గరకు వెళ్తాడు. జ్యోత్స్న, శౌర్య కారు దగ్గర దాక్కుని చూస్తూ ఉంటారు. డోర్ కొడితే శౌర్య అనుకుని ఇంట్లోకి రమ్మని దీప పిలుస్తుంది. కానీ కార్తీక్ మాత్రం తలుపు కొడుతూనే ఉంటాడు. గుమ్మం వరకు వచ్చిన దానివి లోపలికి రాలేవా అని దీప బయటకు వస్తుంది. ఎదురుగా కార్తీక్ ఉండేసరికి కోపంగా చూస్తుంది. జ్యోత్స్న, నేను షాపింగ్ కి వెళ్తున్నాం.. శౌర్యను కూడా తీసుకుని వెళ్తామని అడుగుతాడు కార్తీక్. వద్దని అంటే తాను రావాలని ఆశ పడుతుందని అంటాడు కార్తిక్. అవసరం లేదని దీప కోపంగా అంటుంది. అదే మాట శౌర్యని చూసి చెప్పమని చెబుతాడు. తను అంతగా బయటకు వెళ్లాలని అనుకుంటే నేను తీసుకుని వెళ్తానని అంటుంది దీప.
కార్తీక్ మళ్లీ అడుగుతాడు. మీతో పంపించడం నాకు ఇష్టం లేదని దీప అంటుంది. కార్తీక్ మాటలకు కన్విన్స్ అవుతుంది దీప. సరే తీసుకెళ్లండి కానీ ఒక షరతు బట్టలు కొనకూడదని చెబుతుంది. నాకంటూ దేవుడు మిగిల్చిన బంధం అదొక్కటే. పాప జాగ్రత్త అంటుంది. ఆ మాటకు కార్తీక్ చాలా బాధపడతాడు. ఎన్నటికైనా అర్థం చేసుకుని క్షమిస్తారని చిన్న ఆశ అంటాడు. అమ్మ ఒప్పుకుందా అని శౌర్య అంటే నేను కదా వెళ్ళింది ఒప్పించేసానని అంటాడు కార్తీక్. శౌర్య సంతోషంగా కారులో కిటికీ ఎక్కాలని తెగ సంబరం పడుతుంది. ఇది రోజు రోజుకి అందరికీ దగ్గర అవుతుంది. ఎక్కడ ఉన్నా సంతోషాలకు అలవాటు పడుతుంది. దీన్ని నేను ఆపగలనా అని దీప ఆలోచిస్తుంది. కారులో హ్యాపీగా సన్ రూఫ్ మీద నిలబడి శౌర్య ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. రౌడీ కి తగినట్లే రాకాసి పిల్ల అని పాట పెట్టి బాగా నవ్విస్తాడు కార్తీక్.
మల్లేష్ ఇంట్లో పని చేసుకుంటూ అనసూయ అనని తాను తిట్టుకుంటుంది. అనసూయ నోరు వేసుకుని అరిచేసరికి మల్లేష్ ఇల్లు అమ్మేస్తానని అంటాడు. నీకు రెండు రోజులే టైం ఇస్తానని డబ్బు ఇవ్వకపోతే నువ్వు రోడ్డుమీద ఉండాల్సి వస్తుందని మల్లేష్ అనసూయకు వార్నింగ్ ఇస్తాడు. దీప వెళ్లి మూడు రోజులు అవుతుంది. కనీసం అక్కడ ఏం జరుగుతుందో ఫోన్ చేసి కూడా చెప్పలేదు. దీన్ని పెంచిన నా తమ్ముడికి దరిద్రం పట్టుకుంది. కట్టుకున్న నా కొడుక్కి దరిద్రం పట్టుకుంది. కోడలిని చేసుకున్న నాకు దరిద్రం పట్టుకుంది. ఆ దీప పెద్ద దరిద్ర దేవత అని తిడుతుంది. చంటిది నాన్న అని ఎగిరింది కదా చూసి ఉంటదా? చూసే ఉంటది వాళ్ల నాన్నతో హైదరాబాద్లో చెక్కర్లు కొడుతూ ఉంటుందని అనుకుంటుంది.
కార్తీక్, శౌర్యని తీసుకుని షాపింగ్ కి వస్తాడు. అక్కడ ఒక చిన్న పాప డ్రెస్సులు కనిపించడం లేదని తన నాన్నని పిలుస్తుంది. వెంటనే అతను వచ్చి ఆ పాపను ఎత్తుకుంటాడు. అది చూసి శౌర్య బాధపడుతుంది. తాను పిలవగానే వాళ్ళ నాన్న వచ్చాడు.. మా నాన్న కూడా అలాగే వచ్చి చూపిస్తే బాగుండు అనుకుంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తనని ఎత్తుకుని చూపిస్తాడు. షాప్ లో బట్టలు చూసి తనకు నచ్చాయిని చెబుతుంది శౌర్య. పాప కోసం రెండు తిట్లు తిన్న పర్లేదు అనుకుని తనకోసం బట్టలు తీసుకుంటాడు కార్తీక్. శౌర్య షాప్ లో బట్టలు చూస్తూ ఉంటే అతనిని నరసింహ రెండో భార్య శోభ చూస్తుంది. శౌర్య కూడా శోభాని చూసి భయపడుతుంది. ఆరోజు మా ఇంట్లో పువ్వులు కోసిన పిల్లని నువ్వే కదా అని అంటుంది. అక్కడితో కార్తీకదీపం నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.