బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1453 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ రోజు సెప్టెంబర్ 9 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్ ఏమైందో తెలుసుకుందాం.మోనిత మీద కోపంతో కార్తీక్ కారు వేసుకుని వెళ్ళిపోతాడు.సగం దూరం వెళ్లిన తర్వాత కార్తీక్ దారి మర్చిపోతాడు.మోనిత. ఆటోలో ఇంటికివచ్చేసరికి దీప కార్తీక్‌కి తలకు బామ్ రాయడం చూసి రగిలిపోతూ కేకలు వేస్తుంది.అయితే కార్తీక్ మోనితని ఆపి మోనితా ప్లీజ్.. నేను చెప్పేది విను తన వల్లే నేను ఈ రోజు నీకు దక్కాను తెలుసా’ అంటాడు. దాంతో దీప ఏమి జరిగిందో మీరే చెప్పండి డాక్టర్ బాబు అంటుంది.‘నాకు గుర్తు రావట్లేదు వంటలక్కా.. ప్లీజ్ నువ్వే చెప్పు’ అంటాడు కార్తీక్. మొత్తానికీ దీప ఎలాగోలా కార్తీక్ ను గుర్తు తెచ్చుకోమని చెబుతుంది.
కార్తీక్ తలకు మసాజ్ చేస్తూ దీప :
మోనితని నడిరోడ్డు మీద వదిలేసి కారు తీసుకుని ముందు వెళ్లాక కొంత దూరం వచ్చాక ఆగిపోతాడు.అటుఇటు వెళ్లేవాళ్లని ఆపి.. ‘మా ఇంటికి ఎటు వెళ్లాలి’ అని అడుగుతాడు. వాళ్లంతా కార్తీక్‌ని పిచ్చివాడ్ని చూసినట్లుగా చూసి వెళ్లిపోతారు. అప్పుడే దీప కనిపిస్తుంది. ‘వంటలక్కా వంటలక్కా మా ఇంటికి ఎలా వెళ్లాలో చెప్పవా?’ అంటాడు. దాంతో దీప మనసులో డాక్టర్ బాబుని డైరెక్ట్‌గా అన్నయ్య దగ్గరకు తీసుకుని వెళ్లి.. ట్రీట్మెంట్ ఏదైనా ఇస్తారేమో చూడాలి’ అనుకుంటుంది.ఇదిగో వంటలక్కా మాట్లాడవేంటీ? పదా మా ఇంటికి’ అంటాడు. ‘అదికాదు డాక్టర్ బాబు అని నేను దారిలో మా అన్నయ్య వాళ్లని కలిసి అప్పుడు మీ ఇంటికి వెళ్దామా?’ అని అడుగుతుంది. ‘అయ్యో వద్దు వంటలక్కా.. ముందు ఇంటికి వెళ్లాలి.. నా గురించి మోనిత టెన్షన్ పడిపోతుంది’ అంటాడు కార్తీక్. దాంతో దీప కారు ఎక్కుతుంది. కార్తీక్ కూడా కారు ఎక్కి.. ‘సీట్ బెల్ట్ పెట్టుకో వంటలక్కా’ అంటాడు. దీప పెట్టుకునేలోపే కార్తీక్కే సీట్ బెల్ట్ పెడుతూ ఉంటాడు. దాంతో దీప కాస్త ఎమోషనల్ అవుతుంది.అలా దీప కార్తీక్ ను ఇంటికి తీసుకొస్తుంది. ఆ విషయాన్ని కార్తీక్ గుర్తు చేసుకుని మరీ మోనితకి చెబుతాడు.
దీప, మోనితల సవాల్… గెలుపేవరిది..?
అది విన్న మోనిత కోపంతో కావాలనే దీపని కౌగిలించుకుని మరీ థాంక్స్ వంటలక్కా మా ఆయన్ని తీసుకొచ్చినందుకు అంటుంది.వెంటనే మన వంటలక్క.. మోనితని మరింత దగ్గరకు కౌగిలించుకుంటూ.. ‘ఒకప్పుడు ఇలాగే తీసుకుని వెళ్లి నీ ఇంట్లో పెట్టుకున్నావ్.. నిన్ను తన్ని తరిమేసి మరీ నా దగ్గరకు వచ్చారు.మళ్లీ మా ఆయన నా దగ్గరికే వస్తారు’ అంటుంది నమ్మకంగా. దాంతో మోనిత మరింత మండిపడుతుంది. ఇక దీప వెళ్లిపోతూ ‘డాక్టర్ బాబు.. రేపు వినాయక చవితి పూజ చేస్తున్నాను.. మీరు తప్పకుండా రావాలి అంటే సరే వంటలక్క తప్పకుండా వస్తాను అంటాడు.
మరొక ప్లాన్ వేసిన మోనిత:
మరోవైపు సౌర్య, వారణాసి ఇద్దరూ మట్టి వినాయకుడి బొమ్మలు అమ్మడానికి సిద్ధపడుతూ ఉంటారు.మళ్ళీ సీన్ మోనిత దగ్గర ఓపెన్ అవుతుంది.అప్పట్లోనే కార్తీక్ కోసం ఎన్నో కుట్రలు చేసిదాన్ని.. ఇప్పుడు కూడా కార్తీక్ ను వదిలే ప్రసక్తే లేదు అనుకుంటుంది.ఇంతలో కార్తీక్ వచ్చి ‘మోనితా వంటలక్క రేపు వినాయకచవితికి రమ్మంది కదా.అలా కాకుండా మనమే వంటలక్కని ఇక్కడికి రమ్మని పిలుద్దాం అంటాడు. ఇక మోనిత కార్తీక్‌ని అక్కడికి పంపడం కంటే దీపని ఇక్కడికి రప్పించడమే బెటర్’ అనుకుంటూ మోనిత సరే అంటుంది.
దీపను మెచ్చుకున్న డాక్టర్ :
మరోవైపు దీప.. డాక్టర్ ఇంటికి వెళ్తుంది.జరిగింది అంతా డాక్టర్ తల్లికి చెబితే నీ భర్తని ఇక్కడికి తీసుకుని వచ్చేయాలిసింది కదా అంటుంది.అప్పుడే వచ్చిన డాక్టర్ దీప మంచి పనే చేసింది.కార్తీక్‌ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే దీప కార్తీక్ దృష్టిలో చెడ్డదానిలా మిగిలిపోయేది’ అంటూ సద్దిచెబుతాడు