Categories: Telugu TV Serials

మోనిత నేను సేమ్ టూ సేమ్ అంటున్న శోభ…ముగ్గురు మధ్య నలిగిపోతున్న నిరూపమ్..!!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.ఈరోజు కార్తీకదీపం సీరియల్ 1423 వ ఎపిసోడ్ లో ఏమి. జరిగిందో ముందుగా తెలుకుందాం..గత ఎపిసోడ్‌లో శోభ చెంప పగలకొడుతుంది సౌందర్య.నా కూతురు ఇంట్లో నీ పెత్తనం ఏంటే’ అని శోభ మీద అరుస్తుంది. ఇంతలో స్వప్న రావడంతో ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతాను అంటుంది సౌందర్య. ఇప్పుడే చెబుతున్నాను మీరంతా వినండి.నా ఇష్టప్రకారం నా మనవడు, మనవరాళ్ల పెళ్లి జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది ఫిక్స్’ అంటుంది. ‘మమ్మీ.. అది జరగదు.. జరగనివ్వను’ అని రెచ్చిపోతుంది స్వప్న. ‘సరే.. అది కూడా చూద్దాం అంటూ వెళ్ళిపోతుంది సౌందర్య.

పెళ్లి ఆపమని ప్రేమ్ ను అడిగిన హిమ :

సీన్ కట్ చేస్తే హిమ, ప్రేమ్ ఒక చోట కలుస్తారు. ఏంటి హిమా నన్ను కలవాలని కాల్ చేశావ్ గుడ్ న్యూస్ చెప్పాలా’ అంటాడు ప్రపోజింగ్ వీడియోని గుర్తు చేసుకుంటూ మెలికలు తిరుగుతాడు ప్రేమ్. ఇప్పుడు ఆ విషయం వదిలిపెట్టు.పెళ్లి పనులు మొదలైపోయాయి.వాటిని ఎలా ఆపాలో అది చెప్పు అంటుంది హిమ రిక్వస్ట్‌గా ప్రేమ్ చేతులు పట్టుకుని నేను చూసుకుంటాను హిమా.. నువ్వు ధైర్యంగా ఉండు చాలు’ అంటాడు ప్రేమ్.

రవ్వ ఇడ్లీని కలిసిన శోభ:

మరోవైపు రవ్వ ఇడ్లీ, సౌర్య ఇద్దరూ ఇడ్లీ బండి ముందు కూర్చుంటారు. ‘జ్వాలా ఏంటీ ఈ మధ్య రావడమే మానేశావ్? మీ నాన్నమ్మ వాళ్లది చాలా పెద్ద ఇల్లు అంట కదా? నన్ను ఓ సారి తీసుకుని వెళ్తావా? అలాంటి ఇంట్లో ఒక్కరోజు అయినా ఉండాలి అనేది నా కల జ్వాలా’ అంటాడు రవ్వ ఇడ్లీ. వెంటనే సౌర్య మనసులో నువ్వు కూడా ఆ ఇంటి బిడ్డవేరా అనుకుంటుంది.నాకే ఆ ఇంట్లో దిక్కులేదు. ఇక నువ్వు వస్తే సరిగా చూస్తారనే నమ్మకం లేదు అనుకుంటుంది మనసులో.

శోభ అసలు రూపం తెలుసుకున్న నిరూపమ్ :

మరోవైపు శోభ, స్వప్నలు మా మమ్మీ మనకు ఖర్చు లేకుండా మండపం, డెకరీషన్ అంతా సిద్ధం చేసింది. అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటారు. ఆపండి అని అరుస్తాడు నిరూపమ్.ఏంటి శోభా ఇది..మా మమ్మీ మొండిగా ఉందంటే ఓ అర్థం కానీ నువ్వు కూడా ఏంటీ ఇలా తయారయ్యావ్ అంటాడు.నేను హిమని పెళ్లి చేసుకుంటున్నానని నీకు తెలిసి కూడా ఏంటి ఈ పనులు అంటూ శోభను నిలదీస్తాడు.నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఉంటుంది శోభ.నీ మేనమామ కార్తీక్ జీవితంలో మోనిత అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట కదా.తను ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నేను తనలాంటి దాన్నే అంటుంది. నేను చాలా మొండి దాన్ని నిరూపమ్ అంటుంది.సరే హిమతో ఇప్పుడే ఈ క్షణమే నిన్ను చేసుకుంటాను బావా అని అనిపించు. నేను ఇప్పుడే అమెరికా వెళ్లిపోతాను అంటూ నిరుపమ్ చేయి పట్టుకుని రెచ్చగొడుతుంది.చేయి వదులు శోభ’ అని అనేసి ఆవేశంగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్.

సంతోషాన్ని నటిస్తా అంటున్న సౌర్య:

మరోపక్క హిమ, నిరూపమ్ ల పెళ్లి ఎలా అయినా ఆపాలి అని ప్రేమ్ తన ప్రయత్నాలు మొదలుపెడతాడు. ‘డాడీ మనం ఎలాగైనా హిమ, నిరుమప్‌ల పెళ్లి ఆపాలి’ అంటూ సత్యంతో అంటాడు.అయితే సత్యం మాత్రం.. ప్రేమ్ మాటలు వినిపించుకోడు. ‘ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం సరికాదు.. నువ్వు తలదూర్చకు’ అని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు సౌర్య బాధపడుతుంటే ఆనందరావు వెళ్లి ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కదమ్మా సంతోషంగా ఉండమ్మా’ అంటాడు. ‘సరే తాతయ్యా మీకు కావాల్సింది అదేగా నటిస్తాను’ అంటుంది సౌర్య. అప్పుడే సౌందర్య వచ్చి.. ఆనందరావుకి ధైర్యాన్ని ఇస్తుంది. ‘ముందు హిమ, నిరుపమ్‌ల పెళ్లి చేద్దాం. తర్వాత సౌర్యే తన మనసుకి సర్దిచెప్పుకుంటుందిలెండి’ అంటుంది. ఆ మాటలు విన్న నిరుపమ్ థాంక్స్ అంటాడు. సరిగ్గా అప్పుడే స్వప్న, శోభలు ఎంట్రీ ఇస్తారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

55 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago