(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హిందీ సినిమాలు చూసేవారికి పాత రోజుల్లో దేశభక్తి అనగానే మనోజ్ కుమార్ గుర్తుకు వచ్చేవాడు. ఇప్పుడు కొత్తతరంలో అక్షయ కుమార్ ఆ స్థానం భర్తీ చేశాడు. అతను ఎన్నుకునే సినిమా పాత్రలు, చేసే ట్వీట్లు, కామెంట్లు అన్నీ దేశభక్తికి నకలుగా ఉంటాయి. మరి ప్రధానమంత్రి మోదీ అంతటివాడు ఎన్నికల వేళ తనను ఇంటర్వ్యూ చేయడానికి అక్షయ్‌ను ఎంచుకున్నారంటే దానిని బట్టి తెలియండంలేదా అతని దేశభక్తి!
దానికి ముందు ప్రధాని మోదీ వోటు వేయడంలోని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు కూడా అక్షయ్ కుమార్‌నే ఎంచుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. తీరా చూస్తే మన హీరోగారు మొన్న జరిగిన పోలింగ్‌లో వోటు వేయలేదు. ఎందుకు వోటు వేయలేదని మీడియా నుంచి ప్రశ్న వచ్చినపుడు ఆయన స్పందించిన తీరు ట్విట్టర్‌కు ఎక్కింది. జర్నలిస్టుకు జవాబు ఇవ్వకుండా జానేదో భాయ్ అంటూ అక్షయ్ వెళ్లిపోయారు.
Apolitical Akshay Kumar's angry reaction when a reporter asked him reason for not casting his vote. pic.twitter.com/tlycPwWmDh
— Mohammed Zubair (@zoo_bear) May 1, 2019