(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈ తరానికి తెలియదేమో కానీ ముందు తరంలో హిందీ సినిమాలు, పాటలు ఫాలో అయ్యేవారిని ఓ ఊపు ఊపిన పాటల్లో ఘుంకా గిరారే బరేలీ కి బజార్మె ఒకటి. మెరా సాయా చిత్రంలోని ఈ పాటను రాజా మెహదీ ఆలీ ఖాన్ రాయగా మదన్ మోహన్ బాణీ కట్టారు. ఆశా భోంస్లే అద్భుతంగా పాడిన ఈ పాటకు అభినయం ఆనాటి సెన్సేషన్ సాధన. యుట్యూబ్లో నాలుగేళ్ల క్రితం పోస్టు చేసిన ఈ పాటను ఇప్పటివరకూ రెెండు కోట్ల 60 లక్షల మంది చూశారు.
ఘుంకా అంటే చెవికి పెట్టుకునే జూకా. నిజానికి జూకాలకు, ఉత్తరప్రదేశ్లోని బరేలీ పట్టణానికీ ఎలాంటి సంబంధం లేదు. అక్కడ జూకాలను తయారుచేసేదేమీ లేదు. ప్రాస కురిరింది కాబట్టి కవి బరేలీని వాడుకున్నాడు. 53 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా పాట పుణ్యమా అని బరేలీ పట్టణం పేరు అందరి నోళ్లలో నానింది. అయితే పాట పాపులారిటీని పట్టణంతో లింకు పెట్టేందుకు బరేలీ వాసులు ఇంతవరకూ ప్రయత్నించలేదు.
ఇన్నాళ్లకు బరేలీ డెవలప్మెంట్ అధారిటీకి ఒక ఆలోచన వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చే హైవే బరేలీలో ప్రవేశించేచోట ఒక భారీ జూకాను నెలకొల్పాలని నిర్ణయించారు. ఎనిమిది అడుగుల వ్యాసంలో 12 నుంచి 14 అడుగుల ఎత్తులో జూకా తయారుచేయించాలని భావిస్తున్నారు. డిజైను కోసం కూడా ప్రకటన చేశారు. జూకా నెలకొల్పిన చోట ల్యాండ్ స్కేపింగ్ కోసం 18 లక్షలు ఖర్చు చేయనున్నారు. పాటలో ఒకచోట సురిమీ (కాటుక) ప్రస్తావన కూడా వస్తుంది. అందుకని అక్కడ కాటుక భరిణలు కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నార