(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తైవాన్లో ఈ ఉదయం ఒక వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటనలో 12 మంది గాయపడ్డారు. ఆరుగురు గల్లంతయ్యారు. నాటకీయంగా జరిగిన ఈ దుర్ఘటన సిసిటివి కెమేరాలలో రికార్డయింది.
తైవాన్ తూర్పు తీరంలోని ఇలాన్ కౌంటీలో మంగళవారం ఉదయం వంతెన పైనుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ వెళుతుండగా అది అకస్మాత్తుగా కూలిపోయింది. వంతెనతో పాటు కింద నీటిలో పడిన ట్యాంకర్లో కాస్సేపటి తర్వాత మంటలు చెలరేగాయి. వంతెన కింద ఉన్న మూడు ఫిషింగ్ బోట్లు ధ్వంసమయ్యాయి.
1998లో నిర్మించిన ఈ 460 అడుగుల పొడవు వంతెన 50 ఏళ్ల వరకూ సురక్షితమనీ, ఎందుకిలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నామనీ అధికారులు చెప్పారు.