భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ బీజేపీపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ నుంచి బీజేపీ, భజరంగ్ దళ్ డబ్బులు తీసుకున్నాయని ఆరోపించారు. దీనిపై అందురూ దృష్టి సారించాలని కోరారు. ముస్లింల కంటే ముస్లిమేతరులే ఎక్కువగా పాకిస్థాన్ ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
https://twitter.com/ANI/status/1168016378294439936
అయితే బీజేపీపై దిగ్విజయ్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మీడియాలో కనిపించేందుకు దిగ్విజయ్ తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మాజీ సీఎం చౌహన్ విమర్శించారు.
SS Chouhan, BJP on Congress' Digvijaya Singh's statement on BJP: He gives controversial statements to stay in news. He and his leaders speak Pakistan's language. Pakistan quotes Rahul Gandhi. As far as BJP-RSS is concerned, the entire world, entire country knows their patriotism. pic.twitter.com/cAl2HbLqXP
— ANI (@ANI) September 1, 2019