(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జపాన్ పార్లమెంటులో ఉన్నట్లుండి ఎంపీలంతా హెల్మెట్లు పెట్టుకున్నారు. స్పీకర్‌తో సహా అంతా తెల్ల రంగు హెల్మెట్లను ధరించారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జపాన్‌లో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీలు తమ ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన నియమాలపై ఇటీవల ఎర్త్‌కేక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరికొత్త ఫోల్డబుల్ హెల్మెట్లను ఆవిష్కరించారు. మడిచేందుకు అనువుగా ఉండే ఈ హెల్మెట్లను బ్యాగుల్లో కూడా పెట్టుకోవచ్చు. భూకంపం రాగానే వాటిని తెరిచి తలకు ధరిస్తే చాలు, ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు.
Earthquake drill with foldable helmets for Japan's lawmakers. My favourite video of the day so far ? pic.twitter.com/eIgE9HSxUL
— Juris (@JurisAbramenko) November 27, 2019
ఈ సందర్భంగా జపాన్ స్పీకర్ తడమోరీ ఒషిమా మాట్లాడుతూ.. ‘‘పార్లమెంటులో సభ జరుగుతున్నప్పుడు ఏదైనా విపత్తు చోటుచేసుకుంటే.. మీ డెస్కుల్లో ఉండే ఈ హెల్మెట్లు ధరించండి. ఆందోళన చెందవద్దు. పార్లమెంటులో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండండి’’ అని సూచించారు. జపాన్ పార్లమెంటులో విపత్తుల వల్ల ప్రజా ప్రతినిధులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు 2017న సేఫ్టీ కిట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ కిట్‌లో తాజాగా ఫోల్డింగ్ హెల్మెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. కాగా, జపాన్ ఎంపీల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.