పైలట్ సురక్షితం.. అమెరికాలో ప్రమాదం
కాలిఫోర్నియా: అమెరికాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఎఫ్-16 యుద్ధ విమానం ఒకటి రోజువారీ విన్యాసాలు చేస్తుండగా ఒక మార్ష్ ఎయిర్ రిజర్వ్ బేస్ బయట ఉన్న గోదాములోకి కూలిపోయింది. ఈ ఘటన దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు పైలట్ ముందుగానే పారాచూట్ సాయంతో దూకేయడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Here’s what we know about #F16 crash…
? Happened at 3:15
?Pilot ejected (unknown condition)
?Crash happened at end of March Air Reserve runway
?Plane belongs to 144th Fighter Wing, Air National Guard unit based in Fresno
? They have space at March Air Reserve@ABC7 @ABC30— Veronica Miracle (@ABC7Veronica) May 16, 2019
FIRST LOOK: Inside the warehouse where the #F16 crashed in Riverside. Courtesy: Jeff Schoffstall@ABC7 @ABC30 pic.twitter.com/fim1CSegFZ
— Veronica Miracle (@ABC7Veronica) May 17, 2019
విమానం కూలడం వల్ల చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగిందని బేస్ కు చెందిన అగ్నిమాపక అధికారిని ఉటంకిస్తూ ద లాస్ ఏంజెలిస్ టైమ్స్ తెలిపింది. కేసీఏఎల్-టీవీ అనే స్థానిక టీవీ చానల్లో ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటో చూపించారు. పెద్ద భవనం పైకప్పు మీద రంధ్రం పడినట్లు అందులో ఉంది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో యుద్ధవిమానం కూలిపోయింది. సరిగ్గా వైమానిక కేంద్రం రన్ వే చివర ఉన్న గోదాములోకి అది పడిపోయిందని కేంద్రం అధికార ప్రతినిధి మేజర్ పెర్రీ కోవింగ్టన్ తెలిపారు. పైలట్ పారాచూట్ సాయంతో దిగాడని, అతడు సురక్షితంగా ఉన్నాడని, వేరే ఎవరికీ కూడా గాయాలు కాలేదని చెప్పారు. విమానం కూలే సమయానికి గోదాములో ఎవరూ ఉన్నట్లు లేరన్నారు.
ఈ వైమానిక కేంద్రం కాలిఫోర్నియాకు తూర్పుగా సుమారు 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ రిజర్వుకు చెందిన 452వ ఎయిర్ మొబిలిటీ విభాగం ఉంటుంది. ఈ కేంద్రంలో సాధారణంగా 2000 నుంచి 6000 మంది వైరకు ఎయిర్ ఫోర్సు రిజర్విస్టులు, ఇతర సిబ్బంది ఉంటారని కోవింగ్టన్ చెప్పారు. విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఉత్తర – దక్షిణ దిశలలో ఉండే 215వ అంతర్రాష్ట్ర రహదారిని తాత్కాలికంగా మూసేశారు.