(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
క్యాన్సర్లనగానే వయసు పైబడినవాళ్లకు వచ్చే తీవ్రమైన వ్యాధి అని సాధారణంగా ఉండే అభిప్రాయం. కానీ దీనికి వయసుతో సంబంధం లేదు. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు కూడా ఎక్కువే. క్యాన్సర్ బారిన పడ్డ పిల్లల్లో దాదాపు 30 శాతం మందిలో ల్యుకేమియా కనిపిస్తుంది. అమెరికాలో క్యాన్సర్ బారిన పడిన తన తమ్ముడిని ఓ ఐదేళ్ల చిన్నారి ఓదార్చింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను పిల్లల తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాల్యంలో వచ్చే క్యాన్సర్ తో మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఈ ఫొటో తెలియజేస్తోంది. క్యాన్సర్ తో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు బెకెట్ బర్జ్..కీమోథెరపీ ప్రభావంతో తన అక్క ఆబ్రేతో ఆడుకోలేకపోతున్నాడు. బెకెట్ బర్జ్ కి గతేడాది ఏప్రిల్ లో క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటిను నుంచి కిమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు.
తమ్ముడు బర్జ్ అంటే ఆబ్రేకు ప్రాణం. అతన్ని విడిచి ఒక్క క్షణమైనా ఉండలేదు. నాలుగేళ్ల వయసున్న తమ్ముడికి తానే అమ్మ అయ్యి.. కంటికి రెప్పలా చూసుకుంది. ఆటపాటలతో సంతోషంగా ఉండే తన ఇద్దరు పిల్లలు గత 15 నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారని వారి తల్లి ఫేస్ బుక్ లో పేర్కొంది. పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆమె పోస్ట్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసేవారి గుండెలు బరువెక్కుతున్నాయి. ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాన్ని పిండేస్తోంది.
https://www.facebook.com/beatitlikebeckett/posts/3305533652820876