`నేను భారతీయుడిని నాకు మతం అంటూ లేదు` అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్. ఈయన కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గాంధీ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంంలో ఆయన మాట్లాడుతూ “ నా తండ్రి మతానికి వ్యతిరేకి. నిజానికి నా ఇంటి పేరు శ్రీవాత్సవ. కానీ మేం దాన్ని పట్టించుకోం. నేను మతానికీ చెందినవాడిని కాను. మా కుటుంబంలో బచ్చన్ అనే ఇంటి పేరుని పొందిన తొలి వ్యక్తిని నేనే కావడం సంతోషంగా ఉంది. నేను నర్సరీ స్కూల్లో చేరేటప్పుడు నా తండ్రి ..నాకు బచ్చన్ అని ఇంటి పేరుగా పెట్టారు. జనాభా లెక్కలవాళ్లు వచ్చి మతం గురించి అడిగినా, నేను నాకు మతం లేదు. భారతీయుడిననే చెబుతాను. మా నాన్న ఇంటి పక్కన ఉండే వారిని చాలా బాగా గౌరవించేవారు. పెద్దవారు, మర్యాదస్తుల కాళ్లకు హోలీ రోజున రంగులు పూయడం మన సంప్రదాయం. అందుకే మా నాన్న మరుగుదొడ్లు శుభ్రం చేసే వాళ్ల కాళ్లకు రంగులు పూసి వేడుకలను ప్రారంభించేవారు“ అని తెలిపారు.
previous post