(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు… అంటూ మోటు సామెత ఒకటి ఉంది. అట్లా ఉంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వ్యవహారం. టీమ్ ఇండియా కప్పు కొట్టుకొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న భారత క్రికెట్ ప్రేమికులకు సెమీపైనల్ ఓటమి అశనిపాతంలా పరిణమించింది. అసలే బాధపడుతున్న అభిమానులకు ఐసిసి విడుదల చేసిన ఒక వీడియో పుండు మీద కారంలా కనబడింది. దానితో సోషల్ మీడియాలో ఐసిసిపై విరుచుకుపడుతున్నారు.
Hasta la vista, Dhoni ? #CWC19 pic.twitter.com/TWxbKULjCQ
— ICC (@ICC) July 10, 2019
న్యూజిలాండ్‌పై సెమీఫైనల్స్‌లో ఇండియా ఓటమిని నిర్ణయించిన క్షణం ధోనీ రన్ అవుట్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ అభిమానులకు ఆశలు ఉన్నాయి. ధోనీ రనౌట్‌తో అవి ఆవిరయ్యాయి. అనుకున్నట్లు గానే ఇండియా 18 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. ఆటను మలుపు తిప్పిన ఈ రనౌట్‌పై ఐసిసి హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వాజ్నెగ్గర్ సినిమా టెర్మినేటర్ స్ఫూర్తితో హస్టా లా విస్టా ధోని అనే శీర్షికతో ఈ వీడియో విడుదల చేసింది. దీనిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
https://twitter.com/Lachu205/status/1149013263612555264