(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాంగ్ రూట్లో వచ్చిన ఓ బస్సు డ్రైవర్‌కు స్ట్రాంగ్ డోస్ ఇచ్చింది ఓ మహిళ. కేరళలో ఓ మహిళ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తన స్కూటీపై వెళ్తోంది. అయితే, కేరళ ఆర్టీసీకి చెందిన బస్సు మాత్రం రాంగ్రూట్లో వచ్చింది. ఆ బస్సు ఆమె స్కూటీకి అతి సమీపంగా వచ్చింది. అయినా కూడా ఆమె తన బండి వెనక్కి తిప్పలేదు. కాళు కిందపెట్టి అలాగే చూస్తూ నిలబడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోని మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు.
https://www.facebook.com/IamUnniMukundan/videos/378080113128951/
తానూ సరైన మార్గంలోనే వస్తున్నానని..బస్సు డ్రైవర్ మాత్రం లెఫ్ట్‌లో రాకుండా రైట్లో వచ్చి తనకు అడ్డుపడ్డాడు..కాబట్టి బస్సు డ్రైవరే తప్పుకోవాలన్నట్లుగా ఆ సదరు సైలెంట్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో చేసేది లేక బస్సు డ్రైవర్ కాస్త రూట్ మార్చుకుని సరైన మార్గంలో వెళ్లిపోయాడు. రోడ్డుపై జరిగిన సంఘటనను సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించిన కొందరు దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. ఆ మహిళపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.