లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ నగరంలో కనిపించాడు. ఆస్ట్రిచ్ చర్మంతో కుట్టిన రూ. 9 లక్షల జాకెట్ వేసుకున్నాడు. అతడు నివసించే ఫ్లాట్ విలువ అక్షరాలా రూ.73 కోట్లు!! ఇది ఒక అంతస్థులో సగం ఉంటుంది. లండన్ నగరంలో అత్యంత ప్రముఖమైన సెంటర్ పాయింట్ టవర్ బ్లాకులో ఇది ఉంది. దానికి నెలకు అద్దె సుమారు 16 లక్షలు. కొత్తగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టినా, కంపెనీలో అతడిపేరు డైరెక్టరుగా మాత్రం లేదు. మీసం పెంచుకుని, కొత్త ఆఫీసులో కుక్కతో సహా ఉంటున్నాడని ద టెలిగ్రాఫ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. సెంటర్ పాయింట్ అపార్టుమెంటును 1960లలో కట్టారు. తొలినాళ్లలోని ఆకాశహర్మ్యాలలో అదొకటి. అందులో 33 అంతస్థులు ఉంటాయి. అయితే, బ్రెగ్జిట్ సంక్షోభం తర్వాత మాత్రం ఇందులో సగానికి పైగా ఫ్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి.
నీరవ్ మోదీని టెలిగ్రాఫ్ పత్రికకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు గుర్తించారు. వారిలో ఒకరు చీఫ్ రిపోర్టర్ రాబర్ట్ మెండిక్, మరొకరు మిక్
బ్రౌన్. టెలిగ్రాఫ్ ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలిసిన వీడియో.. బ్రౌన్ తీసినదే. వాళ్లిద్దరూ వీధిలో నీరవ్ మోదీని గుర్తించి అతడిని
మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నీరవ్ క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నిస్తూ, అన్నింటికీ ‘నో కామెంట్’ అనే సమాధానం
ఇచ్చాడు. అయితే బ్రౌన్ మాత్రం 2 నిమిషాల 13 సెకండ్ల పాటు వీడియో తీయగలిగారు. ఇప్పటికే నీరవ్ మీద ఇంటర్ పోల్ రెడ్
కార్నర్ నోటీసు ఉంది. ఇలాంటి సమయంలో అతడికి పనిచేసుకోడానికి వీలుండే ఇన్సూరెన్సు నంబరు ఎలా ఇచ్చారో తెలియడం
లేదు. వజ్రాల కంపెనీ ఉద్యోగులను అడిగినా ఏమీ చెప్పలేకపోయారు. తాము చెప్పగలిగింది ఏమీ లేదని, అలా చెప్పకూడదని
ఒప్పందం ఉందని ఓ ఉద్యోగిని అన్నారు.
ఇక.. నీరవ్ మోదీ వేసుకున్న 9 లక్షల విలువైన ఆస్ట్రిచ్ జాకెట్ గురించి ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. #NiravInLondon
అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో తెగ ట్రెండవుతోంది. ఆస్ట్రిచ్ హైడ్ జాకెట్ సింపుల్ గా హైడియస్ (భయపెట్టేలా.. అసహ్యంగా) ఉందని
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇక గుజరాతీ వజ్రాల వ్యాపారులంతా ఆ తరహా జాకెట్ల కోసం వెతుకుతారని
కమెడియన్ అతుల్ ఖత్రీ చెప్పారు. ఇంత అసహ్యమైన జాకెట్ 9 లక్షలా అని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. శ్రీనగర్
సండే మార్కెట్లో ఇంకా చవగ్గా, మంచివి దొరుకుతాయని సలహా ఇచ్చారు. ఇక మరికొందరైతే జోకులు పేల్చారు. నీరవ్ మోదీ తన
జాకెట్ దానం చేస్తే తన ఇంటిరుణం తీర్చేస్తానని ఒకరన్నారు. ఆస్ట్రిచ్ పక్షులకు నివాళిగా నీరవ్ తన మొహం జాకెట్లో దాచుకోవాలని
ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరైతే, ఎంత ఆస్ట్రిచ్ తోలు జాకెట్ వేసుకున్నా లండన్ లో క్యాబ్ దొరకడం మాత్రం కష్టమని
తేలిపోయిందన్నారు.
https://twitter.com/AbheyendraRana/status/1104400206160891904
నీరవ్ మోదీ వేసుకున్న 9 లక్షల విలువైన ఆస్ట్రిచ్ జాకెట్ గురించి ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి.
#NamumkinAbMumkinHai .. Ease of doing business in foreign with doing scam and leaving India is easy now .. #ModiHaiToMumkinHai #NiravInLondon https://t.co/qG3swrNxix
— Bhushan Patil (@bhushankpatil12) March 9, 2019
https://twitter.com/praveen_gupta21/status/1104345008881180673
https://twitter.com/one_by_two/status/1104264578748211201
What if anyone of us had defaulted on our car/home/personal loan payment?
Could you have said 'NO COMMENT??'#NiravModi#NiravInLondon#London #Breaking #NewsAlert https://t.co/RZPpUtBCeG
— Deepti Sachdeva दीप्ति सचदेवा (@DeeptiSachdeva_) March 9, 2019