Anchor Suma: తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో యాంకర్ సుమ అంటే ఎవరో తెలియని వారు ఉండరు. తన మాటలతో.. వస్త్రధారణతో చక్కటి తెలుగుతనానికి నిండుతనాన్ని ప్రతిబింబించే యాంకర్ సుమ..టెలివిజన్ రంగంలో సినిమా రంగంలో.. తిరుగులేని అవకాశాలతో యాంకర్ గా సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతోంది.కాగా నటిగా ప్రస్తుతం.. “జయమ్మ పంచాయితీ” అనే సినిమా చేయడం తెలిసిందే. టైటిల్ పాత్రలో సుమా నటించడంతో ఈ సినిమా చూడటం కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు. మే ఆరవ తారీకు ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్ పవన్ కళ్యాణ్ ఇటీవల రిలీజ్ చేయటం తెలిసిందే. ట్రైలర్ విడుదల చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్… సుమా గారితో కలిసి నటించాలని..తన డ్రీం అని చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాదు ఆమె అభిమాని అని కూడా పవన్ తెలియజేయడం జరిగింది. నటిగా ఇంకా అనేక సినిమాలు చేయాలని కూడా కోరారు. ఇదిలా ఉంటే యాంకరింగ్.. యాక్టర్ గా మాత్రమే కాక.. సుమా ఇప్పుడు సింగర్ గా కూడా మారినట్లు సరికొత్త వార్త బయటపడింది. విషయంలోకి వెళితే “జయమ్మ పంచాయతీ” సినిమాలో ర్యాపో సాంగ్ సుమ పాడటం జరిగిందట.
ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. సుమ తెలిపింది. యాంకరింగ్ గా టెలివిజన్ రంగంలో తిరుగులేని క్రేజ్ ఉన్న సుమ… ఇండస్ట్రీలో అనేక సినిమా రిలీజ్ వేడుకలకు ఆడియో వేడుకలకు .. యాంకరింగ్ చేసి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో నటిగా “జయమ్మ పంచాయతీ” మే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండటంతో.. సినిమా చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శ్రీకాకుళం భాష యాసలో.. “జయమ్మ పంచాయతీ” సినిమా తెరకెక్కడం జరిగింది.