NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Etela Rajender: కలుసుడా..! కండువా కప్పుకునుడా..! తేలేది ఈ రోజే..!!

Etela Rajender: భుకబ్జా ఆరోపణలతో కేసిఆర్ సర్కార్ నుండి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయం నేడు తేలనున్నది. ఈటల రెండు రోజుల హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా ఈటల కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారని..కాదు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారు అని రకరకాల ఊహగానాలు షికారు చేశాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఈటల సమావేశం అవుతుండటంతో ఆ రకంగా వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల బీజేపీ నుండి పెద్ద ఆఫర్ ఈటలకు వచ్చిందనీ, బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సీనియర్ బీజేపీ నేత కిషన్ రెడ్డి లు సైతం ఈటలతో ఆ విషయంపై చర్చలు జరిపారని వార్తలు రావడంతో బీజేపీలో చేరిక ఖాయమేనన్నట్లు అందరూ అనుకున్నారు.

Etela Rajender delhi tour
Etela Rajender delhi tour

అయితే ఈ వార్తలను ఈటల ఖండించారు. తాను త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నాననీ, ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతల మద్దతు కోసం కలుస్తున్నానని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఈటల ఖండించినప్పటికీ రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీకి చేరుకోవడం ఆయన బీజేపీలో చేరనున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. ఈ రోజు ఉదయం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. బీజెపీలో చేరికపై ఆ పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపేందుకే ఈటల ఢిల్లీకి వెళ్లారన్న మాట వినబడుతోంది.

Read More: Telangana Lockdown: బ్రేకింగ్ .. తెలంగాణలో లాక్ డౌన్ మరో పది రోజులు పొడిగింపు కానీ.. కాస్త వెసులుబాటు ఇది

ప్రధానంగా ఈటల ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీని, కేసిఆర్ ను ఎదుర్కొని  నిలబడాలంటే స్వతంత్రంగా ఉంటే సాధ్యపడదనీ, సేఫ్ జోన్ ‌లో ఉండి రాజకీయం చేయాలంటే బీజేపీ గొడుగు కిందకు వెళ్లడమే శ్రేయస్కరమని సన్నిహితులు చెప్పడం వల్లనే ఈటల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రానికి ఈటల బీజేపీ చేరికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అగ్రనేతలను మర్యాదపూరంగా కలిసి వెళతారా? లేక ఈ రోజే పార్టీ కండువా కప్పుకుంటారా? అనేది సాయంత్రానికి తేలిపోనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N