NewsOrbit
ట్రెండింగ్

తొందరపడుతున్న నిమ్మగడ్డ – పెద్ద సవాల్ రానుంది? 

 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో మొట్టమొదటిసారి 2016లో ఎస్ఈసీ గా   నియమితుడైన నిమ్మగడ్డ యొక్క పదవి కాలం మరొక పది నెలల్లో పూర్తి అవుతుంది. అయితే ఈ మధ్యనే స్థానిక ఎన్నికలను వాయిదా వేసి అధికార పార్టీలో ఆగ్రహానికి గురైన నిమ్మగడ్డ రమేష్…. ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త చట్టంతో ఆ పదవి నుండి తొలగించబడ్డ విషయం కూడా తెలిసిందే. హైకోర్టులో పిటిషన్ వేసుకొని నియమితులైన ఆయన ఇప్పుడు కేవలం పది నెలలు మాత్రమే అతని చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి అతను కూడా పంతానికి పోతున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కొంచెం తొందర ఎక్కువ అని అందరూ అంటుంటారు. అందుకు తగ్గట్లుగానే మొన్న హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తాను పదవీ బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన ప్రకటించడం విడ్డూరం కాగా హైకోర్టు కాపీ చేతికి అందకుండా అనే ఆయన బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకోవడం అతని తొందరపాటుతో దానికి నిదర్శనం అని చెప్పాలి. ఇకపోతే నిమ్మగడ్డ గత రెండున్నర నెలల నుండి ఆంధ్రప్రదేశ్ లో లేరు, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేక తనకు ఏపీలో భద్రత లేదని భావించిన ఆయన తెలంగాణకు వెళ్లిపోయారు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తో ఆయనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాయగా కేంద్రం కూడా వెంటనే అతనికి భద్రతను కల్పించారు. అయితే అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ పైన కూడా నమ్మకం లేదు. ఇప్పటికే ఆయన పై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. మరీ ముఖ్యంగా నిమ్మగడ్డ హోం శాఖకు భద్రత కొరకు రాసిన లేఖ టిడిపి కార్యాలయంలో తయారైందని సిబిఐ ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇంకా ఎస్ఈసీ ఇంకా అంగీకరించనేలేదు. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని మరియు ఆయనను ఎస్ఈసీ ప్త్రస్తుతానికి గుర్తించడం లేదని స్వయంగా అడ్వకేట్ జనరల్ చెప్పడం విశేషం.

ప్రభుత్వంతో అతనికి ఏవైనా పరస్పర విభేదాలు ఉంటే నిమ్మలంగా కూర్చుని పరిష్కరించుకోవాల్సినది పోయి ఇలా తొందరపాటుతనంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసంగా ఉండాలని వ్యాఖ్యలు చేయడం మరియు వారి పాలనను తప్పుపట్టడం వంటివి చేస్తున్న నిమ్మగడ్డకు రానున్న రోజులు సజావుగా సాగవు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri