NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu Naidu: టిడిపి హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!తీవ్రంగా కలత చెందుతున్న చంద్రబాబు!!ఏ విషయంలో అంటే??

Chandrababu Naidu: నిన్నటి వరకు టిడిపికి అండగా ఉన్న శాసనమండలిలో శుక్రవారం ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది. వైసీపీ మెజారిటీ సాధించింది.ఇది చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్న అంశమని టిడిపి వర్గాలే చెబుతున్నాయి.

This is the first time in the history of TDP! Chandrababu is seriously upset !! In what sense ??
This is the first time in the history of TDP! Chandrababu is seriously upset !! In what sense ??

రెండేళ్లు కౌన్సిల్లో టిడిపి ఆడిందే ఆట!

2019 శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైసిపి శాసనసభలో టిడిపిని కుదేలు చేసింది.అసెంబ్లీలో 151 మంది సభ్యులతో వైసిపి అత్యధిక బలంతో ఉండగా టీడీపీకి కేవలం 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు.మొన్నటి ఎన్నికల్లో 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ,వారిలో వల్లభనేని వంశీ, కరణం బలరాం ,వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి చాలాకాలం క్రితమే జగన్ పార్టీకి జై కొట్టారు.మిగిలిన పందొమ్మిదిమందితోనే శాసనసభలో ఏదోవిధంగా నెట్టుకొస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి గుడ్డిలో మెల్ల మాదిరి ఇప్పటి వరకు తమకు బలమున్న శాసనమండలి ఉందనే ధీమా ఉండేది. వైసిపి అధికారం చేపట్టే నాటికి శాసనమండలిలో ఆ పార్టీకి పదకొండు మంది సభ్యులు ఉండగా టిడిపికి ఇరవై ఎనిమిది మంది సభ్యులుండేవారు. పైగా శాసనమండలి చైర్మన్ షరీఫ్, వైస్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ కూడా టిడిపి వారే కావడంతో అనేక సందర్భాల్లో అక్కడ జగన్ ప్రభుత్వం ఇబ్బంది పడింది.ముఖ్యంగా జగన్ మానస పుత్రిక అయిన మూడు రాజధానుల బిల్లు విషయంలో శాసనమండలి సర్కారుకు ఎదురు తిరగడంతో సీఎంకు పట్టలేని కోపం వచ్చింది.ఆ ఆవేశంలో శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో ఆయన ఏకగ్రీవ తీర్మానం కూడా చేయించేశారు.ప్రస్తుతం శాసనమండలి రద్దు తీర్మానం ఢిల్లీలో పెండింగులో ఉంది.

ఇక నుంచి వైసిపి పాడిందే పాట!

కాని శాసనమండలిలో కూడా సంఖ్యాబలాలు మారిపోయాయి.ఒక్క జూన్ నెలలోనే తెలుగుదేశం పార్టీ పధ్నాలుగు మంది ఎమ్మెల్సీలను కోల్పోయింది. టిడిపికి చెందిన గవర్నర్ నామినేటెడ్ కోటాలో నామినేట్ అయిన నలుగురు,స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి ఎన్నికైన పది మంది ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి కావడంతో వారంతా రిటైర్ అయ్యారు.ఒక్క శుక్రవారం నాడే పదిమంది టిడిపి ఎమ్మెల్సీలు మాజీలైపోయారు.మూడు రోజుల క్రితమే నలుగురు వైసిపి నేతలు గవర్నర్ కోటాలో నామినెటెడ్ ఎమ్మెల్సీలుగా నియామకం పొందారు.తాజా బలాబలాలను చూస్తే 58 మంది సభ్యులు ఉండే శాసనమండలిలో ఇప్పుడు వైసీపీకి 21 మంది సభ్యులు ఉండగా టీడీపీ బలం పదకొండు కు పడిపోయింది.దీంతో ఇక కౌన్సిల్లో కూడా వైసిపి ఒంటి చేత్తో చక్రం తప్పబోతోంది.

టిడిపికి ఈ పరిస్థితి ఇదే మొదటిసారి!

తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అనేకసార్లు ఓడిపోయినప్పటికీ ఇంత ఘోరమైన పరాజయం మాత్రం ఎప్పుడూ ఎదురు కాలేదు.2009 అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై నాలుగు సీట్లు గెలుచుకున్న టీడీపీ ఒకటిరెండు శాసనమండలి సభ్యత్వాలను కూడా దక్కించుకుంది.కానీ ఈ పర్యాయం టిడిపి కి అసెంబ్లీలో ఉన్న బలంతో ఒక్క శాసనమండలి సీటు కూడా ఆ పార్టీ కి దక్కే అవకాశమే లేదు.పైగా శాసనమండలిలో కాస్త బాగా మాట్లాడుతారనే పేరున్న బుద్దా వెంకన్న, వైవిబీ రాజేంద్రప్రసాద్ తదితరులు కూడా రిటైర్ అయిపోయారు.కాబట్టి శాసనమండలిలో మిగిలిన నారా లోకేష్ ఇకపై వైసిపికి టార్గెట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju