NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Brahmamgari Matam: కొలిక్కివచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి పంచాయతీ..! 12వ పీఠాధిపతి ఆయనే…!!

Brahmamgari Matam: కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన పీఠాధిపతి నియామక వ్యవహార పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి శివైక్యం చెందగా, తదుపరి మఠాధిపతిగా పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని నియమించాలని మఠాధిపతులు నిర్ణయించారు.  ఇది మఠం అనుసరిస్తున్న సాంప్రదాయమని వారు పేర్కొన్నారు. అయితే దివంగత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మహాలక్ష్మమ్మ తన కుమారుడిని పీఠాధిపతి చేయాలని, ఆ మేరకు తన భర్త వీలునామా కూడా రాశారని వాదించడంతో ఈ వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వివాదం పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

dean of the Brahmangari Matam
dean of the Brahmangari Matam

ఈ క్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురాంరెడ్డి నేతృత్వంలో కందిమల్లయ్యపల్లి సంస్థానం పుర ప్రజల సహకారంతో శుక్రవారం పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.12వ మఠాధిపతిగా మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామికి అవకాశం దక్కింది. ఉత్తరాధికారిగా మొదిటి భార్య రెండవ కుమారుడు వీరభద్రయ్య బాధ్యతలు నిర్వహించనున్నారు. తదనంతరం మఠాధిపతిగా రెండో భార్య మారుతీ మాహాలక్ష్మమ్మ కుమారుడికి అవకాశం రానున్నది. శనివారం ఈ ఎంపికను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read More: Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక వ్యవహారం! మహాలక్ష్మమ్మ వర్సెస్ మఠాధిపతులుగా మారిన వైనం!!

శివైక్యం చెందిన 11వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య చంద్రావతమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చందావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 ఏళ్ల వయస్సులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతీ మహాలక్ష్మమ్మను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా వీరు ఇద్దరు మైనర్లు.

 

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju