NewsOrbit
న్యూస్

Pegasus: మమతపై టిడిపి కుతకుత..ప్రశాంత్ కిశోర్ పైన చిటపట!ఏపీ రాజకీయాలను వేడెక్కించిన పెగాసన్!

Pegasus: పశ్చిమ బెంగాల్ సీఎం మమత పై తెలుగుదేశం పార్టీ కుతకుతలాడుతోంది.మరోవైపు అమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను తెగ ఆడిపోసుకుంటోంది.

TDP slams on Mamata and Prashant Kishore Pegasus Issue
TDP slams on Mamata and Prashant Kishore Pegasus Issue

ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసన్ సాఫ్ట్ వేర్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన పెగాసన్ కు సంబంధించి చేసిన ఒక వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది.

Pegasus: అసెంబ్లీ సాక్షిగా మమత చెప్పిందేమిటంటే?

రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పెగాసన్ విషయమై చర్చ జరిగింది.దీనికి సీఎం మమతా బెనర్జీ బదులిస్తూ ఇజ్రాయిల్ కు చెందిన ఎస్ఓఎస్ అనే సంస్థ దీనిని తయారుచేసి విక్రయిస్తోందని చెప్పారు.ఆ సాఫ్ట్‌వేర్ సృష్టికర్తలు పశ్చిమబెంగాల్ పోలీసు శాఖను ఇరవై అయిదు కోట్లకు దానిని విక్రయిస్తామంటూ సంప్రదింపులు జరపగా తాము తిరస్కరించామని మమత చెప్పారు.అదే సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేసిందని వెల్లడించారు.దీంతో వైసిపి నేతలకు చేతికి పెద్ద ఆయుధం లభించినట్లయింది.అదే సమయంలో టీడీపీ ఆత్మరక్షణలో పడింది.

నాలుక పీక్కున్న నారా లోకేష్!

ఎప్పుడైతే మమతా బెనర్జీ టిడిపిపై ఈ తరహా ఆరోపణలు చేసిందో వెంటనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తెరపైకి వచ్చారు.మమత చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.”మాకు కూడా ఆ కంపెనీ ఆఫర్ చేసిన మాట వాస్తవమే ..అయితే మేము కొనలేదు” అని లోకేష్ చెప్పారు.అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి నీతిబాహ్య చర్య లను ప్రోత్సహించే బాపతు కాదని లోకేష్ పేర్కొన్నారు.ఆ సాఫ్ట్వేర్ తాము కొనుగోలు చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవారు కాదని లోకేష్ వ్యాఖ్యానించారు.ఒకవేళ తాము ఆ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసి ఉంటే జగన్ ప్రభుత్వం ఈపాటికే తమను ఉతికి ఆరేసేదని కూడా ఆయన అన్నారు.

సవాంగ్ కూడా చెప్పిందదే నట!

ఈ సందర్భంలో టిడిపి నేతలుబగతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద పెగాసన్ కు సంబంధించిన సమాధానాన్ని ప్రస్తావిస్తున్నారు.కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి గత ఏడాది జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిందా అని సమాచార హక్కు చట్టం కింద పోలీసు శాఖను కోరగా డిజిపి కార్యాలయం ఆ సాఫ్ట్వేర్ ను తాము కొనుగోలు చేయలేదని జవాబిచ్చిందని చెబుతున్నారు.డిజిపి కార్యాలయం ఇచ్చిన సమాధానంతో ని దీనిపై స్పష్టత వచ్చిందని,ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని టిడిపి నేతలు అన్నారు.

ప్రశాంత్ కిశోర్ వైపు మళ్లిన వేళ్ళు!

కాగా మమతా బెనర్జీ టీడీపీ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బ్రీఫింగ్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అనేక టక్కుటమార విద్యలు ప్రదర్శించి జగన్ ను సీఎం చేయగలిగారని వారు అంటున్నారు.అదే తరహా వ్యూహాలు పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసి మమతా బెనర్జీకి తిరిగి అధికారం దక్కేలా చేశారన్నారు.దుష్ప్రచారం ద్వారా ప్రత్యర్థుల పై బురదజల్లేది ప్రశాంత్ కిషోర్ వ్యూహమని వారు అన్నారు.ప్రశాంత్ కిశోర్ ద్వారానే మమతా బెనర్జీకి కూడా టిడిపి పై తప్పుడు సమాచారం అందిందని,అదే ఆమె వెల్లడించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.అయితే ఇలాంటి దుమారం వల్ల టిడిపికి నష్టమేమీ లేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju