NewsOrbit
Telugu TV Serials

గృహ నిర్భదంలో హిమ.. ప్రేమ్ ప్రేమ విషయం తెలుసుకున్న నిరూపమ్..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1429 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 12 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం గత ఎపిసోడ్‌లో చిన్న రౌడీని చూపించడంతో కధ మరింత ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. ఇక ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో కంటిన్యూ అవుతుంది.నీకోసం నేను రాలేదా? నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వే కదా రాను అంది.. వెతకలేదు అంటావేంటీ?’ అంటుంది సౌందర్య. ‘ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను నాన్నమ్మా.. అది ఉంటే నేను ఉండను.. ఉండలేను ఈ నటనలు చూడలేకపోతున్నాను.. నేను ఎవరో కొత్త వాళ్ల ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’ అంటుంది సౌర్య.

హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను అంటున్న సౌర్య:

ఇంతలో హిమ, ఆనందరావులు అక్కడికి వచ్చి ‘ఏంటి సౌర్యా అలా మాట్లాడతావ్.. నాకు ఎంత హక్కు ఉంటుందో నీకు అంతే హక్కు ఉంటుంది.. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను.. బావతో నీకు పెళ్లి అంటుంది హిమ.ఆ మాట విన్న ఆనందరావు, సౌందర్యలు.. ‘ఏంటీ? ఓ పక్కన నీ పెళ్లి పనులు జరుగుతుంటే.. నిరుపమ్‌కి దానితో పెళ్లి అంటావేంటీ?’ అని హిమని తిడతారు. ‘చూశారా.. దాని మాటలు మీకే ఇలా ఉంటే.. నాకు ఎలా ఉంటుంది’ అని విసుగ్గా అక్కడ నుంచి వెళ్లిపోతుంది సౌర్య.

నిరూపమ్ కి ప్రేమ్ ప్రేమ విషయం తెలిసిపోతుందా..?

సీన్ కట్ చేస్తే ప్రేమ్..ఫోన్లో హిమ ఫొటోని చూసుకుని మాట్లాడుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే నిరుపమ్ వచ్చి ఫోన్ లాక్కుంటాడు. దాంతో ప్రేమ్ కంగారుపడి తిరిగి తన ఫోన్ తను తీసుకుంటాడు. అయితే ఇంతలో సత్య, స్వప్న కూడా వస్తారు.పెళ్లి పనులు,ఫొటోలు, వీడియోలు అవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలని అంటాడు నిరుపమ్. దాంతో ప్రేమ్ ఈ పెళ్లి ఎలా ఆపాలి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

స్వప్న ప్రేమ…సౌర్య ఆవేశం :

ఇక అందరు భోజనం చేస్తూ ఉండగా స్వప్న, సత్యలు షాపింగ్ చేసి. సౌందర్య ఇంటికి వస్తారు. స్వప్న ప్రేమగా సౌర్యా హిమతో పాటు నీకు కూడా చాలా చీరలు కొన్నాను అంటుంది. ఆ మాటకు సౌర్య తినే కంచంలో చేయి కడిగేసి పైకి లేచి నాకు బట్టలు లేవు అని నీకు చెప్పానా అత్తా అంటూ గొడవ పడుతుంది ‘ఈ ప్రేమలు చూడలేక చస్తున్నా.. వీళ్ళ పెళ్లి చేస్తా అని మాటిచ్చాను కదా.. అది అయిపోతే నా దారి నేను చూసుకుంటా’ అనేసి వెళ్లిపోతుంది. సౌర్య ప్రవర్తన చూసి అందరు బాధపడతారు.

నిరూపమ్ ను నిలదీసిన నిరూపమ్ :

ఇక ప్రేమ్‌ని నిరుపమ్ ఒంటరిగా కలిసి ఎందుకు అలా మూడీగా ఉంటున్నావ్ రా అంటూ నిలదీస్తాడు. ఏదైనా లవ్ ప్రాబ్లామ్మా? లేక డబ్బు సమస్యనా నాకు తెలిసి డబ్బుకైతే మనకి లోటు లేదు. మరి ప్రేమ విషయంలో ఏదైనా సమస్యా? చెప్పరా ప్రేమ్.మనం ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉన్నాం కదా అంటూ ఆరా తీస్తాడు నిరుపమ్. దాంతో ప్రేమ్ ‘అవునురా హిమని ప్రేమస్తున్నా, నువ్వు హిమను ప్రేమిస్తున్నావ్.కానీ హిమకి నీతో పెళ్లి ఇష్టం లేదు. దాన్ని ఆపి.. నాతో పెళ్లి చెయ్యమని నీకు ఎలా చెప్పను అని మనసులో అనుకుని అదేమి లేదురా’అనేసి విషయం చెప్పకుండా దాటేస్తాడు.

హిమను గదిలో నుంచి గేంటేసిన సౌర్య:

ఇక హిమ.. సౌర్య రూమ్‌కి వెళ్లి ‘సౌర్యా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటూ బతిమిలాడుతుంది.సౌర్య మాత్రం హిమ చెప్పే మాటలు వినకుండా హిమను తిడుతుంది.మనసులో మాత్రం ‘సౌర్యా మనిద్దరం ఒకరినే ఇష్టపడ్డాం. నువ్వు బావని ఇష్టపడ్డావని తెలిశాక నా ప్రేమని సమాధి చేసుకున్నాను అనుకుంటుంది.ప్లీజ్ సౌర్య నన్ను అర్ధం చేసుకో అంటుంటే హిమని బయటికి లాగేసి తలుపు పెట్టుకుంటుంది సౌర్య.

హిమను గృహ నిర్భంధం చేయనున్న నిరూపమ్ :

మరోవైపు నిరుపమ్ అసలు ప్రేమ్‌కి ఏమైందో తెలియట్లేదు.ఎలాగైనా ఈ పెళ్లి కాగానే ఆ పనిలో పడతాను అనుకుంటాడు. అలాగే హిమ కూడా సౌర్య ఆలోచన నుంచి బయటికి వస్తే బాగుండు.అప్పుడు నిశ్చితార్థం మధ్యలో నుంచి వెళ్లిపోయింది. కొంపదీసి పెళ్లిలో కూడా అలా ఏదైనా చేస్తుందా అనుకుని కంగారు పడతాడు. వెంటనే అమ్మమ్మకి చెప్పి.. హిమని హౌస్ అరెస్ట్ చేయించాలి అనుకుంటాడు నిరుపమ్.

పెళ్లి ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్న హిమ:

సీన్ కట్ చేస్తే హిమ ఇంటి బయట దిగలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే సౌందర్య చీర తీసుకొచ్చి వెంటనే కట్టుకో గుడికి వెళ్లాలి అంటూ ఆర్డర్ వేసి వెళ్లిపోతుంది. ఇంతలో ప్రేమ్ వస్తాడు బావా ఏంటి పరిస్థితి ఇంకా కొన్ని గంటల్లో పెళ్లి అంటూ హిమ కంగారుపడడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.అసలు ఇంతకీ ఎవరి పెళ్లి ఎవరితో అవుతుందో అనేది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu