Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయిన నాటినుండి హౌస్ లో గీతు రాయల్ పేరు గట్టిగా వినిపిస్తూ ఉంది. మొదటి రోజు నుండే ప్రతి ఒక్కరితో గొడవకు దిగడంతో పాటు చాలా రాష్ గా మాట్లాడుతూ చాలా దూకుడు గేమ్ ప్రదర్శిస్తూ ఉంది. బాత్రూంలో వెంట్రుకలు గొడవతో మొదలుకొని సుల్తానాన్ని టార్గెట్ చేసి.. ఆ తర్వాత అనేక మందితో గొడవలకు దిగిన గీతు రాయల్ .. గ్రూప్ గేమ్ లో.. ట్రాష్ లో మొదటి ఉన్న ఆమె బై లక్.. క్లాస్ గ్రూపులోకి వెళ్ళిపోయింది. దీంతో మొదటివారం ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకుంది.
కాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత హౌస్ లో సభ్యులని వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు..? అనేదాన్నిపై డిస్కషన్ చేసి అభిప్రాయాలు తెలియజేయాలని… చెప్పగా హౌస్ లో చాలామంది గీతు రాయల్ పేరు చెప్పారు. ఆమె ముఖానికి స్టాంపు వేయడంతో.. ఎక్కువ స్టాంపులు ఆమెకే పడటంతో.. వరెస్టు కంటెస్టెంట్ గా జైలుకు వెళ్ళింది.
సో సీజన్ సిక్స్ లో మొట్టమొదటి వరస్ట్ కంటెస్టెంట్ .. జైలుకు వెళ్లిన సభ్యురాలు గీతు రాయల్. హౌస్ లో వచ్చిన నాటి నుండి ఆడవాళ్ళతో మగవాళ్ళతో తేడా లేకుండా చాలామందితో గొడవకు దిగింది. ఒకానొక సమయంలో హౌస్ లో బిగ్ బాస్ చెప్పిన నేను చేయను. నేను ఇంతే అన్న తరహాలో గీతు రాయల్ వ్యవహరించడం జరిగింది. దీంతో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో చాలామంది తమ రీజన్ తెలియజేసి గీతు రాయల్ నీ వరస్ట్ కంటెస్టెంట్ గా ఎంచుకున్నారు.