Bigg Boss 6: ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షోకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షోలో కనిపిస్తే చాలు కచ్చితంగా మంచి గుర్తింపు ఉంటుందని చాలా మంది.. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బయట ఎటువంటి గుర్తింపు లేకుండా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండియాలో మొదట హిందీలో ఈ షో స్టార్ట్ అయింది. అక్కడ దాదాపు 15 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. తర్వాత సౌత్ లో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం ఆరో సీజన్ తెలుగులో కొనసాగుతోంది.
ఈ ఆరో సీజన్ లో 21 మంది ఎంట్రీ ఇవ్వగా నలుగురు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం 17 మంది మిగిలి ఉన్నారు. ఇలా ఉంటే హౌస్ లో ఓ కంటెస్టెంట్ గత రెండు రోజుల నుండి కనీసం అన్నం కూడా తినకుండా హౌస్ నుండి.. వెళ్లిపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు చలాకి చంటి. కొత్త కెప్టెన్ కీర్తి కారణంగా ఆమె చంటిని తప్పుగా అర్థం చేసుకోవడంతో…గత శనివారం ఎపిసోడ్ లో చంటి ఈ సీజన్ మొత్తం కెప్టెన్ పోటీ విషయంలో అనర్హుడిగా మిగిలాడు.
ఈ పరిణామంతో హౌస్ లో గేమ్ ఆడిన.. లాభం ఉండదని చంటి భావిస్తున్నాడు. దీంతో శుక్రవారం ఎపిసోడ్ లో షో..నిర్వహకులతో మాట్లాడి వెళ్లిపోవాలని ఉందని ఇంటి సభ్యులతో చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో హౌస్ లో గత రెండు రోజుల నుండి చంటి భోజనం కూడా చేయటం లేదు. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున… చంటి విషయంలో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆడియన్స్ నుండి వినబడుతున్న టాక్.