Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం నామినేషన్ లో మొత్తం 13 మంది సభ్యులు ఉండటం తెలిసిందే. ఈ సీజన్ లో అత్యధికంగా సభ్యులు నామినేషన్ కి ఎక్కింది ఏడో వారంలోనే. భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఈ క్రమంలో మెరీనా లేదా రాజ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలోహియంగా ఏడో వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ బిగ్ బాస్ ఆడియన్స్ ని ఎంతగానో అలరించింది.
హైపర్ ఆది, శ్రీరామచంద్ర, హీరో కార్తీ, యాంకర్ రేష్మి ఇంకా పలువురు సెలబ్రిటీలు వచ్చి ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేఫ్ గా ప్రకటిస్తూ ఉండగా చివరిలో.. వాసంతి మరియు అర్జున్ కళ్యాణ్ మిగిలారు. అయితే అర్జున్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. అర్జున్ ఎలిమినేట్ కావటం పట్ల ఇంటి సభ్యులంతా షాక్ తిన్నారు. శ్రీ సత్య ఇంకా సూర్య, శ్రీహాన్ కంటనీరు పెట్టుకున్నారు.
ఇదే సమయంలో శ్రీహన్, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, గీతూ బాగా ఆడుతున్నారని ఆటంబాంబుగా అభివర్ణించాడు. రోహిత్, మెరీనా, బాలాదిత్య, ఇనాయా, కీర్తి.. ఇంకా గేమ్ బాగా ఆడాలని అర్జున్ కళ్యాణ్ వెళ్తూ వెళ్తూ తెలియజేయడం జరిగింది. అర్జున్ హౌస్ నుండి వెళ్ళిపోతూ ఉండటంతో ఎప్పుడు ఏడవని శ్రీ సత్య.. కన్నీరు పెట్టుకుంది. అంతేకాదు లోపల గేమ్ బాగా ఆడు బయట నేను చూసుకుంటా మొత్తం అంటూ శ్రీ సత్యకి ధైర్యం కూడా వెళ్తూ వెళ్తూ అర్జున్ చెప్పడం విశేషం.