Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పరిస్థితులు వారం వారంకి మారిపోతున్నాయి. గేమ్ చివరికి వచ్చేయడంతో … టైటిల్ ఎవరు గెలుస్తారు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. సింగర్ రేవంత్ పేరు ఎక్కువగా వినబడుతుంది. మొదటినుండి రేవంత్ టైటిల్ గెలవటమే లక్ష్యంగా ఫిజికల్ టాస్క్ ఇంకా ప్రతి విషయంలో దూకుడు గేమ్ ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే పదవ వారంలో బాలాదిత్య ఎలిమినేషన్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించడం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో…గీతూ ఎలిమినేషన్ గురించి బాలాదిత్య సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ షోలో నిజంగా ఎమోషన్స్ ఉంటాయా అని బయట చాలా మంది అనుకుంటారు.. కానీ అవి అంత నిజమే. ఎప్పుడైతే గీతూ ఎలిమినేట్ అని ప్రకటించారు హౌస్ లో అందరికంటే ముందుగా ఏడ్చింది నేనే. గీతూకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. అందువల్లే హౌస్ నుండి వెళ్ళిపోతున్న సమయంలో గీతూ… భయంకరంగా ఏడ్చింది. ఏంతో చాలా బాధపడింది.. అని తెలిపాడు.
గీతూ మంచి గేమర్. అలాంటిది ఆ అమ్మాయి ముందుగానే ఎందుకు ఎలిమినేట్ అయిందన్నది నాకు అర్థం కాలేదు. అంతకుముందు వారం సూర్య ఎలిమినేషన్ కూడా నాకు అర్థం కాలేదు. ఇదిలా ఉంటే నేను ఎలిమినేట్ కావటానికి శ్రీహాన్ కారణమని అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో 10 వారాలు పాటు ఉండి మంచి పేరుతో బయటకు వచ్చాను. చాలా సంతృప్తికరంగా ఉంది. బిగ్ బాస్ షో ద్వారా చాలా నేర్చుకున్నాను అంటూ బాలాదిత్యా ఈ ఇంటర్వ్యూలో… సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.