NewsOrbit
రాజ‌కీయాలు

‘పోలీసులకు సహాయ నిరాకరణ తగదు’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: పోలీసులకు రాజధాని గ్రామాల్లో రైతులు సహాయ నిరాకరణ చేయడం సరికాదని మహిళా కమిషన్ మాజీ  చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. రాజధాని కోసం 33000 ఎకరాలు ఇచ్చిన రైతులు 33 రోజుల పాటు ఇలా రోడ్లపై కూర్చుని ఆందోళనలు నిర్వహించడం తానెక్కడా చూడలేదని అన్నారు. రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ రాజధాని ప్రాంత గ్రామాల్లో సహాయ నిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు.  దీనిపై రాజకుమారి మాట్లాడుతూ పోలీసులు  అందరూ ఒకేలా ఉండరనీ, వారికి సహాయ నిరాకరణ అనేది తప్పునీ అన్నారు. రైతులు,మహిళలు మానవత్వంతో వారికి సహకరించాలని సూచించారు. అధికారుల ఆదేశాలు మాత్రమే వారు పాటిస్తారని చెప్పారు. పోలీసులకు త్రాగు నీరు,ఆహార పదార్థాలు ఇవ్వాలని సూచించారు.

ఈ దరిద్రపు ప్రభుత్వం వల్ల తాను మహిళా కమిషన్ చైర్‌పర్సన్  పదవికి రాజీనామా చేశానన్నారు. మరో రెండేళ్లు పాటు పదవీకాలం ఉన్నా తప్పుకున్నట్లు రాజకుమారి తెలిపారు.రాజధాని ప్రాంత మహిళలను చూస్తుంటే తన గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పోలీసులు ఇలా ప్రర్తించడం గర్హనీయమన్నారు.

శాసనసభలో వైసిపి బలంతో వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం లభించినా కౌన్సిల్‌లో టిడిపి  బలంగా ఉందనీ, మండలిలో బిల్లు ఆమోదం పొందదని అన్నారు. ప్రస్తుతం వికేంద్రీకరణ బిల్లు అమలు అవ్వదని చెప్పారు. మరో మూడు నెలలు సమయం పడుతుందన్నారు.

న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టపరంగా పోరాడి అమరావతి సాధించుకుందామని అన్నారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులు, మహిళలను రాజకుమారి అభినందించారు.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment