NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పూటకొకటి… నోటికొకటి… ఇదీ భా”జపం”…!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతల తీరు ఎవరి తీరు వారిదే అన్నట్లు కనబడుతోంది. అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే మొదటి నుండి గట్టిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కన్నా మినహా బిజెపిలోని ఇతర నేతలు ఎవరూ అధికారపక్షంపై అంతగా దూకుడుగా వ్యవహరించడం లేదు.

రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బిజెపి…రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుండి బలమైన నాయకులకు గాలం వేయడానికి ప్రయత్నించింది. అయితే వైఎస్‌ఆర్ పార్టీ నేతల నుండి స్పందన కొరవడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీలోని నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావులు బిజెపిలో చేరిపోయారు. ఇటీవల కాలంలో జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి బిజెపి నేతలు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. అమరావతి నుండి రాజధాని ఒక్క అడుగు కూడా కదలదని సుజనా చౌదరి పేర్కొనడం, అమరావతి నుండి  రాజధాని తరలిస్తే సహించేది లేదనీ, అడ్డుకుని తీరుతామనీ కన్నా లక్ష్మీనారాయణ శపధం చేస్తుండగా రాజధాని అంశంలో కేంద్రం రాజ్యాంగ బద్ధంగానే నడుచుకుంటుందని అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నర్శింహరావు స్పష్టం చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, సోము వీర్రాజు ఎవరికి వారు విరుద్ధ ప్రకటనలు చేస్తుండగా మాజీ ఎంపి దగ్గుబాటి పురందీశ్వరి అసలు మాట్లాడటమే లేదు. మరో రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ రాయలసీమకు న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నారు.

అయితే గుంటూరులో జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలోనూ నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని విషయంలో కేంద్రం  జోక్యం చేసుకోవాలా? వద్దా? అన్న విషయంపై కొందరు నేతలు జోక్యం చేసుకోవాలనీ, మరి కొందరు చేసుకోరాదని వాదించినట్లు సమాచారం. జివిఎల్ నర్శింహరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాన్ని తెలియజేయగా రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, మాజీ ఎంపి దగ్గుబాటి పురందీశ్వరి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్రం జోక్యం చేసుకోవాలని వాదించినట్లు తెలుస్తోంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ కోర్ కమిటీలో అమరావతి రాజధానిగా కొనసాగించాలని తీర్మానం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై పోరాటానికి దిగాలని కొందరు నేతలు ప్రతిపాదించారని సమాచారం.    

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju

Leave a Comment