ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త గా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులైయ్యారు. అదే విధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకరత్గా నెదురుమల్లి రాంకుమార్ రెడ్డిని పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఇవేళ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన పార్టీ మారతారు అన్న పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి.‘నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశాం..? ఏం చేశామని ఓట్లడగాలి..? గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం ఓ గుంతకు కూడా తట్టెడు మన్నుపోసి పూడ్చలేకపోయాం’ అని ఎమ్మెల్యే ఆనం ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలకు బిల్లులు ఇవ్వకపోవడంతో అవి పూర్తి కావడం లేదంటూ కామెంట్స్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుండటంతో పార్టీ సీరియస్ అయ్యింది. పార్టీ ఇన్ చార్జి పదవి నుండి ఆయనను తప్పించి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది. పార్టీకి నష్టం కల్గించేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై పార్టీ వేసినట్లు అయ్యింది.

ఇక పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులైయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్, 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి పోతుల సునీత పై విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తర్వాత వైసీపీలో చేరిన ఆమంచి చీరాల వైసీపీ సమన్వయకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కరణం బలరాంపై పరాజయం పాలైయ్యారు. టీడీపీ నుండి గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరడంతో పాటు 2014 ఎన్నికల్లో ఆమంచి మీద ఓటమి పాలైన పోతుల సునీత కూడా వైసీపీలో చేరారు. దీంతో చీరాల వైసీపీలో మూడు వర్గాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి గ్రూపులను సమన్వయపర్చే కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ , పార్టీ పెద్లు పలు మార్లు ఆమంచితో చర్చలు జరిపి పర్చురు ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పించినట్లు తెలుస్తొంది.
వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ పర్చూరులో ఆ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ అయితే పర్చురులో పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
YSRCP Internal: రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు మళ్లీ ఖాయమే ..! కానీ..?