Tammineni Vs Darmana: మారుతున్న సీక్కోలు రాజకీయం .. ! తమ్మినేని, ధర్మాన లో మంత్రి పదవి ఎవరికి.?.

Tammineni Vs Darmana jagan cabinet
Share

Tammineni Vs Darmana: రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే, సీఎంగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండున్నరేళ్లకు మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పుల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటి నుండి కొత్త మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది, ఎవరిని బయటకు పంపుతారు అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఏపిలో చివరి జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడి అధికార వైసీపీలో ఊహించని మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జిల్లాలో కీలక మార్పులు జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ జిల్లాలో ధర్మాన కృష్ణదాసు, సీదిరి అప్పలరాజులు జగన్ క్యాబినెట్ లో ఉండగా తమ్మినేని సీతారాం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు.

Tammineni Vs Darmana jagan cabinet
Tammineni Vs Darmana jagan cabinet

తమ్మినేని మొదటి నుండి స్పీకర్ పదవి పట్ల అయిష్టంగా ఉన్నారు. మంత్రిపదవిని ఆశిస్తే జగన్ స్పీకర్ గా ఉండాలని సూచించడంతో ఆయన మాటకు గౌరవించి స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సారి విస్తరణలో తమ్మినేనికి మంత్రివర్గంలో స్థానం ఖాయమన్న వార్తలు వినబడుతున్నాయి. స్పీకర్ గానే తమ్మినేని సీతారాం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక మంత్రిగా ఉంటే చంద్రబాబును ఒక ఆట ఆడేసుకుంటారని తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి జగన్ సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ్మినేనికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చినట్లయితే ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన పలకాల్సిందే. తమ్మినేని స్థానంలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు అవకాశం కల్పిస్తే ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసును తప్పించాల్సి ఉంటుంది.

తొలి సారి మంత్రి వర్గంలోనే ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్ బెర్త్ ఉంటుందని అందరూ భావించారు. జిల్లాలో కీలక నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు.. కోట్ల విజయభాస్కరరెడ్డి, నెదురుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ క్యాబినెట్ లో పని చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరావు వైసీపీ తరపున శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అందరి ఊహలకు భిన్నంగా తొలి నుండి తన వెంట నడిచిన ధర్మాన సోదరుడు కృష్ణదాసుకు జగన్..మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ సారి జరగనున్న కెబినెట్ విస్తరణలో తమ్మినేనిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ధర్మాన ప్రసాదరావుకు స్పీకర్ పదవి ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఒక వేళ తమ్మినేనిని స్పీకర్  గా కొనసాగిస్తే ధర్మానకు మంత్రివర్గంలో చోటు లభించవచ్చనే టాక్ నడుస్తోంది. జిల్లాలో రాజకీయాలు ఏ విధంగా మారతాయో చూడాలి మరి.

1.Huzurabad By poll: రూటు మార్చిన కాంగ్రెస్ ..! ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ఎంపిక..! కొండా సురేఖకు నో ఛాన్స్..!!.

2.AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు.

3.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!

 


Share

Related posts

BJP : కార్య‌క్ర‌మం బీజేపీ నేత పుట్టిన రోజు… చేసింది కేసీఆర్ పై విమ‌ర్శ‌లు

sridhar

శృతిహాసన్ మళ్ళీ ఫాంలోకి వచ్చింది.. ఆ ఒక్క సినిమా కూడా హిట్ అయితే ఇక తిరుగుండదు ..!

GRK

Etala Rajender: ఈటల చేరికను బీజేపీ లైట్ తీసుకుందా? అమిత్ షా, నడ్డా లేరెందుకు?

Muraliak